ఓట్ల కోసమే ఎన్నికల ముందు మోదీ సీఏఏ అంశాన్ని తెరపైకి తెచ్చారని మజ్లిస్ అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. సీఏఏ నిబంధనలను ఐదేళ్లుగా పెండింగ్ లో ఉంచి ఇపుడు ఎందుకు అమలు చేస్తున్నారో కేంద్ర ప్రభుత్వం వివరణ ఇవ్వాలని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. సీఏఏపై కేంద్రం గెజిట్ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. ఎన్నికల సీజన్ రాగానే సీఏఏ నిబంధనలు వస్తాయన్న ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సీఏఏపై తమకు అభ్యంతరాలున్నాయని తెలిపారు.


విభజన చేసే సీఏఏ ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులుగా చూడాలన్న గాడ్సే ఆలోచనపై ఆధారపడిందని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ఆరోపించారు. హింసకు గురైన ఎవరికైనా ఆశ్రయం ఇవ్వండి కానీ... మతం, జాతీయత ఆధారంగా ఉండరాదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అభిప్రాయపడ్డారు. కేవలం ముస్లింలు లక్ష్యంగా ఎన్పీఆర్ - ఎన్ఆర్సీతో పాటు సీఏఏ తీసుకొచ్చారని... సీఏఏ వేరే ఏ ఇతర ప్రయోజనాలకు ఉపయోగపడదని ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: