మార్చి 17 నాటికి రేవంత్ రెడ్డి సీఎం అయ్యి వంద రోజులు అవుతుంది. ఆరు గ్యారంటీల పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్‌ పార్టీ... వంద రోజుల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు గతంలో పదేపదే చెప్పారు. ఇప్పుడు ఆ హామీలు అమలు చేయాలని విపక్ష పార్టీ బీఆర్ఎస్‌ గుర్తు చేస్తోంది. ఈ నెల 17తో కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి వంద రోజులు పూర్తి అవుతుందని గుర్తు చేస్తోంది. కాంగ్రెస్‌ ఇచ్చిన హామీలు మాత్రం అమలుకాలేదని ఇప్పటికే ఆరోపిస్తోంది. ఉచిత బస్సు ప్రయాణం తప్పితే ప్రజలకు ఒరిగిందేమీలేదని.. ఆరు గ్యారంటిలు అమలు చేశాకే కాంగ్రెస్ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఓట్లు అడగాలని డిమాండ్‌ చేస్తోంది.

కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వాన్ని విమర్శిస్తూ పాలన సాగించాలని చూస్తుందంటున్న బీఆర్ఎస్ నేతలు.. ఎన్నికల షెడ్యూల్ వస్తే రైతు బంధు, రైతు రుణ మాఫీ ఎట్లా అమలు చేస్తారని ప్రశ్నిస్తున్నారు. ఎన్నికల షెడ్యూల్‌ పేరుతో ప్రభుత్వం తప్పించుకును ప్రయత్నం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: