జనగణనలో బీసీ కులగణన చేపట్టాలని వైసీపీ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జాతీయ బీసీ యువజన సంఘం జాతీయ అధ్యక్షుడు గవ్వల భరత్ కుమార్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ విద్యా నగర్ నుంచి బషీర్ బాగ్ లోని అమ్మవారి దేవాలయం వరకు ఆయన బీసీ న్యాయ యాత్ర చేపట్టారు. జనగణలో కులగణన చేయడానికి కేంద్రంపై ఒత్తిడి పెంచడానికి అన్ని రాజకీయ ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్ లో ఏకమై ఒత్తిడి పెంచాలని ఆర్. కృష్ణయ్య కోరారు.


కుల గణన కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాలకు రాజ్యాంగం కల్పించిన సదుపాయాల కోసం అవసరమన్న ఆర్. కృష్ణయ్య కుల గణనతో ఒక్కొక్క కులం జనాభాతో పాటు సాంఘిక, ఆర్థిక, రాజకీయ వివరాలు సేకరించి వారి కులాలకు జనాభా ప్రకారం లభిస్తాయన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ బీసీ కులగణన, పార్లమెంట్ బీసీ బిల్లు పెడతామని ప్రకటిస్తుందో ఆ పార్టీకి బీసీలు మద్దతు ఇస్తామన్న ఆర్. కృష్ణయ్య బీసీ వర్గానికి చెందిన ప్రధాన మంత్రి ఉండి  కూడా బీసీ బిల్లు పెట్టకపోతే చరిత్రలో ఎవరు కూడా చేయరన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: