గెలిచిన పార్టీ టికెట్లకు ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు.. ఇప్పుడు కాంగ్రెస్ పరిస్థితి అలాగే ఉంది. అందుకే తెలంగాణలో కాంగ్రెస్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక ఓ కొలిక్కి రాలేదు. ప్రత్యేకించి ఎక్కువ మంది పోటీపడుతున్న ఐదు నియోజకవర్గాల విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. రెండు, మూడు రోజుల్లో దిల్లీలో మళ్లీ జరిగే పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశంలో ఈ ఐదు నియోజకవర్గాల అభ్యర్థులపై హైకమాండ్‌ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.


కాంగ్రెస్‌ ఇప్పటికే తొలి జాబితాలో 4 సీట్లకు అభ్యర్థులను ప్రకటించింది. మొత్తం 7 స్థానాలకు ఒక్కో పేరును తెలంగాణ స్క్రీనింగ్‌ కమిటీ సిఫార్సు చేసింది. అయితే భువనగిరిపై ఏకాభిప్రాయం కుదరలేదు. మిగిలిన ఆరు స్థానాలైన పెద్దపల్లి, నాగర్‌కర్నూల్‌, చేవెళ్ల, మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, ఆదిలాబాద్‌లకు అభ్యర్థులను కాంగ్రెస్‌ ఇవాళ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఖమ్మం, వరంగల్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌, మెదక్‌, భువనగిరి, హైదరాబాద్‌ స్థానాలకు మరోసారి పేర్లు ఖరారు చేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: