పాకిస్తాన్, తాలిబాన్‌ మధ్య విభేదాలు ముదురుతున్నాయి. తాజాగా పాకిస్థాన్‌లోని నేవీ ఎయిర్‌స్టేషన్‌ పీఎన్‌ఎస్‌ సిద్ధిఖ్‌పై బలూచిస్తాన్‌ తిరుగుబాటుదారులు విరుచుకుపడ్డారు. ఈ స్థావరంపై తుపాకులు, బాంబులతో దాడికి దిగారు. అయితే సైనికులు, పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో నలుగురు తిరుగుబాటుదారులు మరణించారు. తమ ఎయిర్‌ స్టేషన్‌కు ఎలాంటి నష్టం జరగలేదని పాకిస్తాన్‌ అధికారులు చెబుతున్నారు.


ఈ దాడికి తమదే బాధ్యత అని ‘బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది.  తాము చేసిన దాడిలో 12 మంది పాకిస్థానీలు మృతి చెందినట్లు బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ప్రకటించింది. పాకిస్థాన్‌ సైన్యం మాత్రం ఈ విషయంపై నోరు మెదపట్లేదు. అయితే ఇలా ఈ తరహా దాడికి యత్నించడం ఈ వారంలో ఇది రెండోసారి కావడం విశేషం. ఈనెల 20న కూడా గ్వాదర్‌ పోర్టుపై ముష్కరులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో భద్రతా బలగాలు ఏడుగురు తీవ్రవాదులను చంపేశాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: