బీజేపీ తెలంగాణ రాష్ట్ర పార్టీ శ్రేణులు అభ్యర్థుల మధ్య సమన్వయంపై మోడీ ఫోకస్‌ పెట్టారు. ఇటీవల కొత్తగా పార్టీలో చేరిన వారికి టికెట్లు ఇవ్వడంతో అక్కడక్కడ అభ్యర్థులకు పార్టీ కార్యకర్తలు నాయకుల మధ్య సమన్వయం తగ్గింది. అందుకే పార్టీ  హైకమాండ్ పరిస్థితులను చక్కదిద్దే పనిలో పడింది. అందులో భాగంగానే పార్టీ ముఖ్య నేతలకు తెలంగాణలో పార్టీని సమన్వయం చేసే బాధ్యతలను కట్టబెట్టింది. పార్టీ జాతీయ సహా ప్రధాన కార్యదర్శి శివప్రకాష్‌, ఇతర నేతలు చంద్రశేఖర్ తివారీ, సునీల్ బన్సల్‌, లక్ష్మణ్, కిషన్ రెడ్డిలకు సమన్వయం చేసే బాధ్యతలు అప్పగించింది. వీరిలో ఒక్కొక్కరికి రెండు, మూడు నియోజకవర్గాల బాధ్యతలను కేటాయించింది. తెలంగాణ రాష్ట్రానికి రానున్న శివప్రకాష్.. సమన్వయంపై ఫోకస్‌ పెడతారు. హైదరాబాద్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ పరిధిలో శివ ప్రకాష్‌ సమన్వయం బాధ్యతలు చూస్తారు. ఆయన నాగర్ కర్నూల్‌, హైదరాబాద్ పార్లమెంట్ నేతలతో త్వరలో సమావేశమవుతారు.


మరింత సమాచారం తెలుసుకోండి: