ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో గోనె ప్రకాశ్ రావు అంటే తెలియని వారుండరు. రాజశేఖర్ రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావ సమయంలో జగన్ వెంట నడిచిన కొద్ది మంది నాయకుల్లో ఆయన కూడా ఒకరు. ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్ గా కూడా వ్యవహరించారు. గత కొంత కాలంగా సమకాలీన రాజకీయ అంశాలను విశ్లేషిస్తూ వస్తున్నారు. రాజకీయాల కంటే విశ్లేషణలకే ఆయన అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు.


తాజాగా ఆయన ఏపీ ఎన్నికలకు సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఎన్నికల్లో కూటమి తప్పకుండా విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు. బీజేపీతో పొత్తు ఇబ్బందికర పరిస్థితులు ఉన్నా.. కూటమి గెలుపును మాత్రం ఆపలేదన్నారు. కూటమికి 100-145 స్థానాలు దక్కే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. లోక్ సభ విషయానికొస్తే 19-21 సీట్ల వరకు వస్తాయన్నారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: