ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం అని చెప్పటానికి సిగ్గు పడే పరిస్థితికి సీఎం జగన్ తెచ్చారని.. తాను వస్తే మళ్లీ ఏపీని పట్టుదలతో రాష్ట్రాన్ని నంబర్ వన్ గా చేయాలని ముందుకు వెళ్తున్నామని చంద్రబాబు అంటున్నారు. వికసిత్ భారత్ ప్రధాని నరేంద్ర మోడీ లక్ష్యమని.. 2040 కల్లా తెలుగు జాతి ప్రపంచంలో నంబర్ వన్ కావాలని నా విజన్ అన్న చంద్రబాబు.. కూటమి మేనిఫెస్టో అందరూ చదవాలన్నారు. భగవద్గీత బైబిల్ ఖురాన్ మాదిరిగా ఈమేనిఫెస్టో మీ జీవితాలకు వెలుగు ఇస్తుందన్న చంద్రబాబు.. సీఎం జగన్ తప్పుడు కేసులు పెట్టి ప్రజలను వేదిస్తున్నారన్నారు.

బాబాయ్ ని గొడ్డలితో లేపేసిన అవినాష్ చిన్న పిల్లాడా అని ప్రశ్నించిన చంద్రబాబు.. ఇలాంటి మాటలు మాట్లాడే వ్యక్తి ముఖ్యమంత్రి కావటం దురదృష్టమన్నారు. పట్టణాల్లో ఉండే వారు ఓటు వేయాలని పిలుపు ఇచ్చిన చంద్రబాబు.. మీరు ఓటు వేయడం మానేస్తే గొడ్డలి మీ ఇంటికి వస్తుందన్నారు. ప్రతి ఓటు విలువైనది, ప్రజాస్వామ్యానికి ఓటు వజ్రాయుధమని చంద్రబాబు గుర్తు చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: