ఢిల్లీ మద్యం విధానం సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్ పై దిల్లీ రౌస్‌ అవెన్యూ కోర్టు ఇవ్వాళ తీర్పు వెలువరించనుంది. సీబీఐ కేసులో బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ కవిత.. మహిళ ప్రజాప్రతినిధిగా కవిత పీఎంఎల్ఏ సెక్షన్ 45 ప్రకారం బెయిల్‌కు అర్హురాలని.. అరెస్ట్ నుంచి విచారణ వరకు ఎటువంటి మెటీరియల్ లేదని.. ఎలాంటి ఆధారాలు లేకుండానే అరెస్ట్ చేశారని.. ఈడి కస్టడీలో ఉండగా, సీబీఐ ఎందుకు అరెస్ట్ చేసిందని వాదించారు.

అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేకపోయినా.. అరెస్టు చేశారని.. తాను బీఆర్ఎస్ పార్టీకి స్టార్ క్యాంపెయినర్‌నని.. చిదంబరం కేసులో తీర్పు తనత విషయంలో సరిపోతుందని వాదించారు. ఏడేళ్ల లోపల శిక్ష పడే కేసులకు అరెస్ట్ అవసరం లేదని... అరెస్టుకు సరైన కారణాలు లేవని కవిత తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే కవితకు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ కోరింది.


మరింత సమాచారం తెలుసుకోండి: