తెలంగాణలో కురిసిన అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. మున్సిపల్, పోలీసు, విద్యుత్తు శాఖ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అకాల వర్షాలతో ప్రజలు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశించారు.  అకాల వర్షాలతో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఉరుములు , మెరుపులతో కురిసిన అకాల వర్షం కారణంగా విద్యుత్తు స్తంభాలు కూలడం , చెట్లు కూలడం లాంటివి జరిగిన చోట్ల తక్షణం పునరుద్ధరణ చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.


అవసరమైన చోట్ల సహాయ కార్యక్రమాల్లో భాగస్వామ్యం కావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్ నగరంతో పాటు రాష్ట్రంలో పలు లోతట్టు ప్రాంతాలు వర్షపు నీటితో జలమయం అయ్యాయి. హైదరాబాద్ లో రహదారులపై నిలిచిన నీటిని తక్షణం తొలిగించేందుకు మునిసిపల్ , పోలీసు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి  ఆదేశించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: