ఏపీరాష్ట్రవ్యాప్తంగా 4లక్షల30 వేల మంది పోస్టల్‌ బ్యాలట్లకు దరఖాస్తు చేసుకున్నారు. అయితే.. మంగళవారానికి వారిలో 3లక్షల 30 వేల మంది ఓట్లు వేశారు. అందులో 2లక్షల76వేల మంది పైగా ఉద్యోగులే ఉన్నారు. పాత గణాంకాలు తీసి చూస్తే..  2019 ఎన్నికల్లో పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకున్నవారు 2లక్షల38 వేల మంది మాత్రమే. ఇలా గణనీయంగా పోస్టల్‌ ఓట్లు నమోదు కావడం ఏ  పార్టీకి అనుకూలమన్న చర్చ ఏపీలో నడుస్తోంది.


పోస్టల్‌ బ్యాలట్‌ వినియోగించుకునేందుకు ఉద్యోగులు, ఉపాధ్యాయులు మండుటెండల్లోనూ ఉత్సాహం కనబరుస్తున్నారు. కొన్నిచోట్ల అధికారులు.. అటూ ఇటూ తిప్పుతున్నా ఓపిగ్గా వెళ్తున్నారు. కొన్నిచోట్ల ఫాం 2 దరఖాస్తు ఇచ్చినా వారి పేర్లు ఓటరు జాబితాల్లో ఉండటం లేదు. మరోసారి రావాలని సూచిస్తున్నారు. పోస్టల్‌ ఓట్లంటే ఉద్యోగ, ఉపాధ్యాయులు, ఒప్పంద ఉద్యోగులవే కాబట్టి.. ఎక్కువగా ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందని కూటమి నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: