భవిష్యత్‌లో బీఆర్‌ఎస్‌ కాంగ్రెస్‌ లో విలీనం కావడం ఖాయమని బీజేపీ అంటోంది. బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ శక్తివంతమైన పార్టీగా ఎదగబోతుందని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ న్నారు. పోలింగ్ శాతం కూడా తమకు సానుకూలమనే భావిస్తున్నట్లు బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ పేర్కొన్నారు. రెండు సార్లు అధికారంలో ఉన్న మోదీపై వ్యతిరేకత కాకుండా సానుకూలత పెరిగిందని ఎంపీ లక్ష్మణ్‌ అన్నారు.

తెలంగాణలో అన్ని పార్టీల కన్నా భాజపా ఎక్కువ సీట్లు గెలుస్తుందని ఎంపీ లక్ష్మణ్‌ అభిప్రాయపడ్డారు. సహకరించిన అందరికి పార్టీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ తరపున ఎంపీ లక్ష్మణ్‌ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని.. రేవంత్ రెడ్డి నేల విడిచి సాము చేసిన విధంగా ఉచితాలను గ్యారంటీలను ప్రజలు నమ్మలేదని ఎంపీ లక్ష్మణ్‌ తెలిపారు. మరి కాంగ్రెస్‌లో బీఆర్‌ఎస్‌ విలీనం అవుతుందా.. అంత సీన్‌ ఉందా?


మరింత సమాచారం తెలుసుకోండి:

brs