ఏపీలో ఇటీవల ఎన్నికల తంతు ముగిసింది. జూన్ 4 న ఫలితాలు వెల్లడి కానున్నాయి. ప్రస్తుతం రెండు నెలలుగా రెస్ట్ లేకుండా ప్రచారంలో మునిగి తేలిన పార్టీ అభ్యర్థులు నాయకులు, అధినేతలు రెస్ట్ మూడ్ లోకి వెళ్తున్నారు. ఇదే క్రమంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలింగ్ జరిగిన దగ్గర నుంచి సైలెంట్ ఉన్న సీఎం జగన్ ఐ ప్యాక్ బృందం వద్దకు వెళ్లి బాంబ్ పేల్చారు.

గత ఎన్నికల్లో కంటే ఈ సారి ఎక్కువ సీట్లు గెలుస్తున్నామని.. చెప్పడంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు మొదలయ్యాయి. ఇదే సమయంలో కూటమిలో అంతర్మధనం మొదలైంది. ఓటింగ్ శాతం పెరగడమే దీనికి కారణమా అనే విశ్లేషణలు మొదలయ్యాయి. 2019 కి మించి అంటే ఎలా సాధ్యమనే మీమాంస కూడా ప్రారంభమైంది. ఎవరెన్ని చెబుతున్నా జగన్ మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా కనిపిస్తున్నారు. ఏపీలో ఎక్కడ చూసినా జగన్ లెక్కలపైనే చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: