దీంతో ఈసీ సంక్షేమ పథకాలకు నిధులు విడుదల చేయడాన్ని నిలిపివేసింది. ఈసీ ఆదేశాలతో నష్టపోతున్నామని, పాత పథకాలకే నిధులు విడుదల కాలేదని పలువురు లబ్ధిదారులు హైకోర్టుని ఆశ్రయించారు. దీంతో మే 10న ఒక్కరోజు మాత్రమే నిధులు విడుదల చేయాలని హైకోర్టు తీర్పు నిచ్చింది. దీనిపై ఈసీ అభ్యంతరం చెప్పడం.. 10న వాదనలు ముగిసే నాటికి నగదు బదిలీ కాకపోవడం జరిగిపోయాయి. దీంతో పోలింగ్ ముగిసే వరకు డబ్బులు పంపిణీ చేయోద్దని హైకోర్టు సీజే ఆదేశించారు. సీన్ కట్ చేస్తే పోలింగ్ ముగిసిన తర్వాత లబ్ధిదారులకు నిధులు జమ కాలేదు. దీంతో వైసీపీపై , సీఎం జగన్ పై టీడీపీ విమర్శలు చేయడం మొదలు పెట్టింది. జగన్ ఓడిపోతున్నారని తెలిసి ఈ సంక్షేమ పథకాల నిధులను కాంట్రాక్టర్లకు చెల్లిస్తున్నారని ఆరోపణలు గుప్పించింది. వీటిని ఎల్లో మీడియా కూడా ఫ్రంట్ పేజీలో కథనాలు ప్రచురించింది. తీరా చూస్తే ఇప్పుడు ప్రభుత్వం విడతల వారీగా నిధులను లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేస్తోంది.