ఇరాన్ లో కీలక వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న ఇద్దరు శక్తిమంతమైన నేతలు ప్రమాదంలో మరణించడం వెనుక శత్రువుల ప్రమేయం ఉందా అనే సందేహాలు మొదలయ్యాయి. అయితే ఇరాన్ తో పాటు అనేక మంది శత్రు దేశాల సభ్యులను అంతమొందించిన చరిత్ర ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొసాద్ కు ఉంది. అయితే వీటిని ఇజ్రాయెల్ ఖండించింది. ఇరాన్‌ అధ్యక్షుడి మరణంపై టెల్ వీన్ స్పందించింది. రైసీ మరణంలో తమకు ఎటువంటి ప్రమేయం లేదని అంతర్జాతీయ మీడియా సంస్థకు స్పష్టం చేసింది.


ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం వేళ ఇరాన్ కు చెందిన జనరల్ ను నెతన్యాహూ సైన్యం మట్టుపెట్టడం.. తీవ్ర ఉద్రిక్తలకు దారి తీసింది. మరోవైపు ఇరాన్ దాడులను ఇజ్రాయెల్ దళాలు నిలువరించినా..  ఈ కీలక పరిణామాల నేపథ్యంలో రైసీ దుర్మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. అయితే దట్టమైన పొగమంచు, ప్రతికూల వాతావరణంలోనే హెలీక్యాప్టర్ క్రాష్ అయిందన.. ఈ సమయంలో ల్యాండ్ చేయడానికి యత్నిస్తుండగా కుప్పకూలి ఉంటుందని ప్రస్తుతానికి అంచనా వేస్తున్నారు. ఇజ్రాయెల్ నిజంగా చేసి ఉంటే.. ప్రతికూల వాతావరణాన్ని ఆ దేశం సృష్టించలేదు కదా అని కొందరి వాదన.

మరింత సమాచారం తెలుసుకోండి: