హైదరాబాద్‌లో అక్రమ ఇంజెక్షన్ల దందా బయపడింది. అక్రమంగా ఇన్సులిన్ ఇంజక్షన్లు కొనుగోలు చేసి విక్రయిస్తున్న హోల్ సేల్ మెడిసిన్ డీలర్లపై డీసీఏ కొరడా ఝుళిపించింది. ఇటీవల హోల్ సేల్ మెడిసిన్ డీలర్లపై దాడులు చేసిన డీసీఏ అధికారులు.. పలువురు ఎలాంటి బిల్లులు లేకుండానే ఇన్సులిన్ ఇంజక్షన్లను కొనుగోలు చేస్తున్నట్టు గుర్తించారు. పలువురు దిల్లీ నుంచి ఇన్సులిన్ ఇంజక్షన్లు కొనుగోలు చేసి  భారీ డిస్కౌంట్లతో విక్రయిస్తున్నట్టు గుర్తించారు. ఇలా కొనుగోలు చేసిన ఇన్సులిన్ పెన్ లను దాదాపు 40 శాతం డిస్కౌంట్ తో విక్రయిస్తున్నట్టు డీసీఏ పేర్కొంది.


ఆరుగురి లైసెన్సులను రద్దు చేస్తూ డీసీఏ ఆదేశాలు జారీ చేసింది.  ఈ మేరకు పద్మారావు నగర్ కి చెందిన డ్రగ్ హబ్, ఉప్పల్ లోని శ్రీ తిరుమల ఫార్మా, సుల్తాన్ బజార్ లోని శ్రీ పరాస్ మెడికల్ ఏజెన్సీస్, నాగోల్ లోని శ్రీ గణేష్ ఫార్మా డిస్ట్రిబ్యూటర్స్, కాప్రాలోని శ్రీ రాజ రాజేశ్వర డిస్ట్రిబ్యూటర్స్, కాచిగూడ లోని శ్రీ బాలాజీ ఏజెన్సీల లైసెన్సులను రద్దు డీసీఏ రద్దు చేసింది. ఆయా ఏజెన్సీల నుంచి దాదాపు 52 లక్షల విలువైన ఇన్సులిన్ పెన్ లను డీసీజీ సీజ్ చేసినట్టు ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: