కొత్త బ్రాండ్ ల మద్యానికి రాష్ట్రంలో అనుమతి ఇవ్వలేదని ఎక్సైజ్ శాఖా మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పిందంతా అబద్దమని  తేలిపోయిందని బీఆర్‌ఎస్‌ నేత మన్నె క్రిశాంక్ ఆరోపించారు. సోం డిస్టిలరీస్ కంపెనీ ద్వారా కొత్త బీర్ కంపెనీని తెలంగాణకు తీసుకొస్తున్నారని మన్నె క్రిశాంక్ తెలిపారు. సోం డిస్టిలరీలో కాంగ్రెస్ జాతీయ నేత దిగ్విజయ్ సింగ్ అవినీతికి పాల్పడ్డారని కేసు నడిచిందని... 2019 లో కోటీ 31 లక్షలు సోం డిస్టిలరీస్ కాంగ్రెస్ పార్టీకి విరాళాలు ఇచ్చిందని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.


మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సోం డిస్టిలరీస్ సంస్థను సీజ్ చేశారని, అనేక సార్లు అనేక సార్లు రైడ్స్ జరిగాయని చెప్పారు. సోం డిస్టిలరీస్ కంపెనీ వలన మధ్యప్రదేశ్ లో 65 మంది చనిపోయారని మన్నె క్రిశాంక్ అన్నారు. సాక్షాత్తు ఆబ్కారీ మంత్రి జూపల్లి కృష్ణారావు అబద్దాలు చెప్తున్నారన్న క్రిశాంక్... సోం డిస్టిలరీస్ కంపెనీకి తెలంగాణలో బీర్లు అమ్మడానికి సీఎం రేవంత్ రెడ్డి డీల్ చేసి పర్మిషన్ ఇచ్చారా అని మన్నె క్రిశాంక్ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని మండిపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: