తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డుల కోసం ఎప్పుడా ఎప్పుడా అని ఎదురు చూస్తున్న దరఖాస్తుదారుల శుభవార్త. ఎలక్షన్ కోడ్ ముగిసిన వెంటనే ఎప్పటి నుండో ఆగిపోయి ఉన్న రేషన్ కార్డులు ఇచ్చేస్తారట. ప్రకటించిన విధంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ అందచేయడం జరుగుతుందని రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. ఇల్లు లేని ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని మంత్రి పొంగులేటి ప్రకటించారు.


అర్హులందరికీ కొత్త పెన్షన్లు కూడా ఇస్తామని మంత్రి పొంగులేటి తెలిపారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకుని ఆగస్టు 15వ తేదీ లోగా రైతు రుణ మాఫీ చేస్తామని మంత్రి పొంగులేటి స్పష్టం చేశారు. అన్ని గ్రామాల్లో పాఠశాలలు, రోడ్లు, కమ్యూనిటీ హాళ్లు నిర్మిస్తామని మంత్రి పొంగులేటి చెప్పారు.


శాసనసభ ఎన్నికల మ్యానిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో భాగంగా ఆరు గ్యారంటీలు అమలు చేసి తీరుతాం అని మంత్రి పొంగులేటి పునరుద్ఘాటించారు. ఈ మేరకు మంత్రి పొంగులేటి సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

మరింత సమాచారం తెలుసుకోండి: