పోస్టల్ బ్యాలెట్ల చెల్లుబాటు అంశం వివాదాస్పదం అవుతోంది. ఈ అంశంపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పోస్టల్ బ్యాలెట్ అంశంలో ఇచ్చిన మెమోపై కేంద్ర ఎన్నికల సంఘానికి వైసీపీ కంప్లయింట్‌ ఇచ్చింది. ఎలక్షన్ కమీషన్ ఆఫ్ ఇండియా ఛీఫ్ కమీషనర్ రాజీవ్ కుమార్ కి ఈ అంశంపై ఎంపీ నిరంజన్ రెడ్డి ఫిర్యాదు చేశారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలో ఇచ్చిన మెమో భారత ఎన్నికల కమిషన్ నిబంధనల కు విరుద్ధం అని ఎంపీ నిరంజన్ రెడ్డి ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.


అటెస్టింగ్ అధికారుల స్పెసిమెన్ సంతకాల సేకరణ ఈసీఐ నిబంధనలకు విరుద్ధమని ఎంపీ నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇది పోస్టల్ బ్యాలెట్ ఓట్ల ను తిరస్కరించేదుకు దారితీసేలా ఉంద‌ని ఎంపీ నిరంజన్ రెడ్డి కేంద్ర ఎన్నిక‌ల క‌మిష‌న్ దృష్టికి తీసుకెళ్లారు. ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా ఇచ్చిన మెమో ను తక్షణమే సమీక్షించి, తగిన నిర్ణయం తీసుకోవాలని ఎంపీ నిరంజ‌న్‌రెడ్డి విజ్ఞప్తి చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: