హైదరాబాద్‌ నగరంలో నేరాలు పెరుగుతున్నాయి. పట్టపగలే హత్యలు జరుగుతున్నాయి. తాజాగా నగరంలో 24 గంటల్లోనే 5 హత్యలు 2 హత్యా యత్నాలు జరగడం సంచలనం సృష్టిస్తోంది. పాత బస్తీ శాలిబండ పోలీస్ స్టేషన్ పరిధిలో నిమ్రా ఫాస్ట్ ఫుడ్ యజమాని రఫీక్ దారుణ హత్యకు గురయ్యారు. శాలిబండ  పోలీస్ స్టేషన్ పరిధిలో వజీద్, ఫకృద్దీన్ లపై హత్యా యత్నం జరిగింది.


అలాగే సికింద్రాబాద్ పరిధి తుకారం గేట్  పోలీస్ స్టేషన్ పరిధిలో అడ్డ గుట్టలో భార్య రోజాను భర్తే హత్య చేశాడు. మరోవైపు అసిఫ్ నగర్ లో అలీం అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కాచిగూడ  పోలీస్ స్టేషన్ పరిధిలో ఖిజార్ అనే వ్యక్తిని దుండగులు  హత్య చేశారు. సనత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో భరత్ నగర్ లో అజార్ అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: