హైదరాబాద్ నుంచి కౌలాలంపూర్ వెళ్లే విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. విమానం టేక్ ఆఫ్ అయినా 15 నిమిషాలకే కుడివైపు ఇంజిన్ లో మంటలు వచ్చాయి. మంటలను గుర్తించి వెంటనే లాండింగ్ కి పైలట్ అనుమతి కోరాడు. అనుమతి వచ్చే వరకూ కొద్దిసేపు పాటు విమానాన్ని గాల్లో చక్కర్లు కొట్టించారు ఏటీసీ అధికారులు. ప్రమాద తీవ్రతను గుర్తించి అత్యవసర లాండింగ్ కి ఏటీసీ అనుమతించింది. దీంతో మలేషియా ఎయిర్‌లైన్స్ విమానాన్ని సేఫ్ గా లాండింగ్ చేయించారు ఏటిసి అధికారులు.

ఈ విమానంలో  సిబ్బందితోపాటు 138 మంది ప్రయాణికులు ఉన్నారు. విమానం సేఫ్‌గా  ల్యాండ్ కావడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తరచు ఇలాంటి విమాన అపశ్రుతులు జరుగుతున్నాయి. ఇటీవల దిల్లీ దర్బంగా విమానంలో గంట పాటు ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడ్డారు. విమాన ప్రయాణికులు తస్మాత్ జాగ్రత్త.


మరింత సమాచారం తెలుసుకోండి: