హైదరాబాద్‌లో మరో సైబర్ నేరగాళ్ల ముఠా గుట్టు రట్టయింది. సైబర్‌ నేరగాళ్లకు సిమ్‌ కార్డులు, బ్యాంకు ఖాతాలు సమకూరుస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. హైదరాబాద్ నగరానికి చెందిన ముగ్గురిని అరెస్టు చేసిన సైబర్‌ సెక్యురిటీ బ్యూరో పోలీసులు.. నిందితుల నుంచి 113 సిమ్‌ కార్డులు 3 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్‌ నగరంలోని పలువురి వ్యక్తుల పేర్లతో సిమ్‌ కార్డులు తీసుకుని ఈ ముఠా వాటిని దుబాయ్‌ కు పంపుతోంది.

 
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా ఈ నేరంలో భాగస్వాములైనట్టు పోలీసులు గుర్తించారు. దుబాయిలో ఉండి భారత్‌లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకుని నేరాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. దుబాయిలో ఉండే విజయ్‌ అనే వ్యక్తి కీలకంగా వ్యవహరిస్తున్నట్టు గుర్తించిన పోలీసులు.. చైనాకు చెందిన నేరగాళ్ల కోసం దుబాయిలో కాల్‌సెంటర్‌ నిర్వహిస్తున్న విజయ్‌ను అరెస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: