ఏపీలో టీడీపీ ప్రభుత్వం రావడంతో అమరావతి ఊపిరి పీల్చుకుంది. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చంద్రబాబు నిన్న అమరావతి ప్రాంతాన్ని పరిశీలించారు. నిన్న దాదాపు రెండున్నర గంటల పాటు రాజధాని నిర్మాణ పనులను ఏపీ సీఎం పరిశీలించారు. ఈ పరిశీలనలో అనేక విషయాలు వెలుగు చూశాయి.

మరి ఇప్పుడు అమరావతి ప్రాజెక్టుల ప్రోగ్రెస్ రిపోర్టు ఏంటి.. అంటే.. ఐఏఎస్, ప్రజా ప్రతినిధుల హౌసింగ్ 80 శాతం పూర్తి అయ్యాయని తెలుస్తోంది. అలాగే సీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీస్ 77 శాతం పూర్తి అయ్యింది. గ్రూప్ - డి హౌసింగ్ 75 శాతం మేర పూర్తి అయ్యాయి. ఎన్జీవో హౌసింగ్ 62 శాతం పూర్తి అయ్యింది. గెజిటెడ్ ఆఫీసర్ల హౌసింగ్ 60 శాతం పూర్తయింది. ఉన్నతాధికారుల బంగ్లాలు 28.50 శాతం పూర్తయింది. జడ్జీల, మంత్రుల బంగ్లాలు 27.30 శాతం పూర్తయ్యాయి. సాధ్యమైనంత త్వరగా ఈ ప్రాజెక్టులను మళ్లీ ప్రారంభించాలని టీడీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: