మాజీ సీఎం జగన్‌ అసెంబ్లీ సమావేశాల్లో ప్రమాణ స్వీకారం చేయగానే వెంటనే సొంత నియోజక వర్గం పులివెందుల వెళ్లిపోయారు. అక్కడ స్థానిక ప్రజలతో భేటీ అవుతున్నారు. ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా అదే రూట్‌లో సొంత నియోజక వర్గానికి వెళ్తున్నారు. కుప్పంలో సీఎం చంద్రబాబు పర్యటించబోతున్నారు. రెండు రోజులపాటు సొంత నియోజకవర్గంలో పర్యటించనున్న చంద్రబాబు.. ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా కుప్పంకు వెళ్తున్నారు.

ఈ మధ్యాహ్నం 12.30 గం. లకు కుప్పం పిఈఎస్ మెడికల్ కాలేజీ హెలిప్యాడ్ కు రానున్న చంద్రబాబు.. మధ్యాహ్నం 12.55 గం. శాంతిపురం మండలం జల్లిగానిపల్లి వద్ద హంద్రీ నీవా ప్రాజెక్టు కాలువను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1.35 గంటలకు శాంతిపురం మండలం చిన్నారి దొడ్డిలో హంద్రీ నీవా కాలువ పరిశీలిస్తారు. 2.10 గం. లకు కుప్పం ఆర్ అండ్ బి అతిథి గృహనికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3గంటలకు కుప్పంలోని ఎన్టీఆర్  విగ్రహం సర్కిల్ వద్ద బహిరంగ సభ నిర్వహిస్తారు. సాయంత్రం 4.35 గంటలకు కుప్పం  ఆర్ అండ్ బి అతిథి గృహంలో పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారు.


మరింత సమాచారం తెలుసుకోండి: