ట్రాయ్ కాల్స్ పేరుతో సినీనటి అనన్యకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ముంబయి నుంచి కాల్ చేసి తన నెంబర్ ను రెండు గంటలు బ్లాక్ చేస్తామని వారు చెప్పారు. తన ఆధార్ కార్డు ఉపయోగించి ఎవరో సిమ్ తీసుకున్నారని చెప్పారు. ఆ సిమ్ ద్వారా మనీలాండరింగ్ కు పాల్పడుతున్నారని.. సిమ్ బ్లాక్ చేస్తున్నామని వారు చెప్పారు. మనీలాండరింగ్ కేసులో చిక్కుకోకుండా పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికేట్ తీసుకోవాలని సూచించారు. ట్రాయ్ నుంచి కాల్ చేస్తున్నామని చెప్పి వారే పోలీసులకు కాల్ కలిపారు. వీడియో కాల్ చేసి కంప్లైట్ ఇస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.


స్కైప్ లో రికార్డింగ్ పీఎస్ అనే ఐడీ నుంచి నటి అనన్యకు వీడియో కాల్ చేశారు.  థర్డ్ పార్టీ అకౌంట్ పేరుతో డబ్బులు పంపించమని అనన్యను డిమాండ్ చేశారు. దీంతో అనన్యకు అనుమానం వచ్చింది. చెక్‌ చేసుకుంటే అంతా సైబర్‌ నేరగాళ్ల పని అని తేలింది. దీంతో డబ్బు చెల్లించకుండా తప్పించుకుంది. అలా అడిగితే సైబర్ నేరగాళ్లు అని గుర్తుంచుకోవాలని.. భయం, ఆశతో మోసగాళ్లు డబ్బులు అడుగుతుంటారని అనన్య  ప్రజలను హెచ్చరించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: