రామోజీరావు సంస్మరణ సభను ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించబోతోంది. ఈ మేరకు విజయవాడలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఓ వ్యక్తి సంస్మరణ సభను చంద్రబాబు సర్కారు నిర్వహిస్తోందని తెలుస్తోంది. ఈ సభకు ఏడు వేల మందికి ఆహ్వానాలు పంపినట్టు తెలుస్తోంది. కేంద్రమంత్రులు, రాష్ట్ర ప్రముఖులు పెద్ద ఎత్తున రానున్నారు. సీఎం చంద్రబాబు, పవన్ కల్యాణ్‌.. ఇతర మంత్రులంతా ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారు.


మంత్రులు నిమ్మల రామానాయుడు, కొలుసు పార్థ సారథి, కొల్లు రవీంద్ర సభ ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి చెరుకూరి రామోజీరావన్న మంత్రులు.. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి అసామాన్య విజయాలు సాధించారన్నారు. ఆయన జిల్లాల్లో జన్మించారు కాబట్టి ఆయన సంస్మరణ సభ ను ఇక్కడే చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు భావించారని మంత్రులు తెలిపారు. ప్రభుత్వo తరుపున ఆయనకు ఘన నివాళులు అర్పించాలని ఈ సంస్మరణ సభ నిర్వహిస్తున్నామని.. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర ప్రముఖులు పాల్గొంటారని.. సభకు వచ్చేవారికిఇబ్బందులు లేకుండా పటిష్ట చర్యలు చేపడుతున్నామని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: