విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆగిపోతుందా.. మోడీ ఏపీకి ఆ గుడ్‌ న్యూస్‌ చెబుతారా.. అంటే ఏమో కావచ్చని అంటున్నారు. ఎందుకంటే.. విశాఖ ఉక్కు కర్మాగారం పై  కేంద్ర మంత్రి కుమారస్వామి ని రాష్ట్ర బీజేపీ ఎంపీలు కలిశారు. ఉక్కు కర్మాగారం లాభాల బాటలోకి తీసుకొచ్చేందుకు ఒక ప్రణాళిక ను కేంద్ర మంత్రికి ఇచ్చారు. రాష్ట్ర బీజేపీ ఎంపీల ప్రతిపాదనకు   కేంద్ర మంత్రి కుమారస్వామి సానుకూలంగా స్పందించినట్లు వారు ఓ ప్రకటన విడుదల చేశారు.


గతంలో కూడా విశాఖ ఉక్కు వ్యవహారం పై  ఇచ్చిన  వినతుల ఆధారంగా అధికారులతో.. చర్చలు జరిపినట్లు కుమార స్వామి చెప్పారని బిజెపి నేతలు చెబుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు పూర్వ వైభవం తీసుకుని వచ్చేందుకు అవసరమైన అన్ని విషయాలను పరిగణలోకి తీసుకోవాలని మంత్రిని కోరినట్లు బీజేపీ ఎంపీలు చెప్పారు. అధికారులతో  కూలంకుషంగా చర్చలు జరిపిన తరువాత ఇదే విషయం పై రెండు మాసాల్లో మరోమారు చర్చిద్దామని చెప్పినట్లు పేర్కొన్న బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: