నెల్లూరు జిల్లా రొట్టెల పండుగ జులై 17న ప్రారంభం కాబోతోంది. ఇక్కడకు వచ్చి రొట్టెలు తీసుకుంటే.. కోరికలు తీరతాయని నమ్మకం ఉంది. తాజాగా నెల్లూరు నగరంలోని బారాషాహీద్ దర్గాలో రొట్టెల పండగ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి,  పొంగూరు నారాయణ, ఎమ్మెల్యే శాసనసభ్యులు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమీక్ష చేశారు. రొట్టెల పండుగకు చేపట్టనున్న ఏర్పాట్లను ప్రజాప్రతినిధులకు కమిషనర్ వికాస్ మర్మత్, ఎస్పీ ఆరీఫ్ హఫీజ్ వివరించారు.

మత సామరస్యానికి ప్రతీక నెల్లూరు రొట్టెల పండుగ అని మంత్రి నారాయణ తెలిపారు. రొట్టెల పండుగ కు సుమారు 400 ఏళ్ల ఘన చరిత్ర ఉందని.. రొట్టెల పండుగ కు పటిష్ఠమైన ఏర్పాట్లు చేయాలని.. పారిశుద్ధ్యం, తాగునీరు, పార్కింగ్, ఫైర్ ఏర్పాట్లలో అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. దర్గాకు టెండర్ల ద్వారా వచ్చే ఆదాయాన్ని దర్గా అభివృద్ధి కి ఇచ్చేలా ఆర్థిక శాఖ అధికారులతో చర్చిస్తున్నామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: