దేశంలో మోడీ హవా ఎందుకు తగ్గిందో తెలుసుకోవాలని బీజేపీ నేత సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏర్పాటు అయిన కూటమి ప్రభుత్వానికి శుభాకాంక్షలు చెప్పిన ఆయన రాష్ట్రంలో చాలా కసితో కూటమి నాయకులు అధికారంలోకి వచ్చారని అన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో అన్ని రంగాలలో రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందన్న ఆయన.. కానీ దేశంలో ఎన్డీఏ కూటమికి అనుకున్న స్థానాలు రాలేదన్న విషయం కూడా మర్చిపోకూడదని సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు.


ఎన్నికల ఫలితాలు పై సూక్ష్మ స్థాయి నుంచి చర్చించుకోవలసిన అవసరం ఉందన్న సీహెచ్‌ విద్యాసాగర్‌రావు.. మోదీ నేతృత్వంలో భారతదేశం మంచితనం ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించిందన్నారు. దేశంలో కాంగ్రెస్ పార్టీ దుష్ప్రచారాలు చేస్తోందని.. బీజేపీ అన్యాయం చేస్తుందని అపోహలు సృష్టిస్తున్నారని సీహెచ్‌ విద్యాసాగర్‌రావు అన్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ఇప్పుడు వచ్చిన సీట్లు కంటే ఎక్కువ రావాలని ఆకాంక్షించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: