ఏపీలో చంద్రబాబు సర్కారు భలే విచిత్రం చేసింది. ఎల్లుండి రిటైర్మెంట్‌ కానున్న ఇధ్దరు కీలక ఐఏఎస్‌లకు నిన్న పోస్టింగ్‌ ఇచ్చింది. వెయిటింగ్ లో ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారులు జవహర్ రెడ్డికి, పూనమ్ మాలకొండయ్య కు పోస్టింగ్ ఇస్తూ నిన్న ప్రభుత్వ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆర్థికం గా వెనుకబడిన వర్గాల సంక్షేమ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్ రెడ్డి కి పోస్టింగ్ ఇస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. అలాగే ఆ విభాగం అదనపు బాధ్యతల్లో ఉన్న అనంత రాము ను రాష్ట్ర ప్రభుత్వం రిలీవ్ చేసింది.

ఇక సాధారణ పరిపాలన శాఖ లో జీపీఏం , ఏఆర్ విభాగం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గా పూనమ్ మాలకొండయ్య కు పోస్టింగ్ ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30 తేదీన జవహర్ రెడ్డి, పూనమ్ మాలకొండయ్యలు ఉద్యోగ విరమణ చేయనున్నారు. ఉద్యోగ విరమణ చేయనున్న మూడు రోజుల ముందు ఇరువురు అధికారులకు పోస్టింగ్ ఇవ్వడం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: