వైసీపీ ప్రభుత్వం డేటా ఎంట్రీ ఆపరేటర్లను కూడా వేదనకు గురి చేసిందని ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు. పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్లకు ఏడాదిన్నరగా జీతాలు కూడా చెల్లించలేదన్న విషయం ఆయనకు తాజాగా తెలిసి వచ్చింది. అధికారులతో నిర్వహించిన సమీక్షలో పవన్‌ కల్యాణ్‌కు ఈ విషయం తెలిసింది. ఒక్కో విభాగం లెక్కలు చూస్తుంటే వైసీపీ పాలకుల ఆర్థిక అరాచకం ఆందోళన కలిగిస్తోందని ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అంటున్నారు.

బ్లాక్ లిస్టులో ఉన్న కాంట్రాక్టర్లకు పనులు ఎలా అప్పగించారని పవన్‌ కల్యాణ్‌ అధికారులను ప్రశ్నించారు. అలాంటి కాంట్రాక్టర్లకు బిల్లులు ఏ మేరకు చెల్లించారో నివేదిక ఇవ్వాలని అధికారులను ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కోరారు. గ్రామాల వారీగా చేపట్టిన పనుల వివరాలు స్థానిక ప్రజలకు తెలిపేలా బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్‌ కల్యాణ్ సూచించారు. పి.ఆర్. అండ్ ఆర్డీ, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఇంజినీరింగ్ విభాగాల సమీక్షలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: