ఏపీ మాజీ సీఎం జగన్‌పై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ప్రజలు అధికారాన్ని మనకు సొంత పగలు తీర్చుకోవడానికి ఇవ్వరనే విషయాన్ని జగన్‌ను చూసి నేర్చుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.  ఏపీ ప్రజలు 2019లో జగన్‌కు 151 సీట్లను ఎన్నో ఆశలతో ఇచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి  అన్నారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్‌ చేసిన పనులు తప్పని నిరూపించడానికే మొన్న ప్రజలు 11 సీట్లు ఇచ్చారని సీఎం రేవంత్‌ రెడ్డి  గుర్తు చేశారు. కేసీఆర్ తెలంగాణలో టీడీపీని లేకుండా చేయాలనుకున్నారని గతంలో అనుకున్నారని.. కానీ ఇప్పుడు ఆయనే తుడిచి పెట్టుకుపోయారని సీఎం రేవంత్‌ రెడ్డి ఎద్దేవా చేశారు.


కేసులతో రాజకీయ ప్రయోజనాలు ఎలా ఉన్నా మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుందని రేవంత్ రెడ్డి అన్నారు. తాను ఏ విచారణకు ఆదేశించినా అందులో ప్రభుత్వ సంస్థలు, కేసీఆర్ మాత్రమే ఉండరని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రైవేటు ఇన్‌ఫ్రా కంపెనీలు, ఇతర సంస్థలు కూడా ఉంటాయని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు చేపట్టినా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడేది లేదని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: