గత ఎన్నికల్లో జగన్‌ను దింపి చంద్రబాబును పీఠం ఎక్కించడంలో ఉద్యోగుల పాత్ర కూడా చాలా కీలకం. ఎందుకంటే.. జగన్‌ హయాంలో తాము చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నామని ఉద్యోగులు ఫీలయ్యారు. అందుకే చంద్రబాబును అధికారంలోకి తెచ్చందుకు తమ వంతు కృషి చేశారు. అందుకే తమ కృషి ఫలించిన నేపథ్యంలో సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ ప్రధాన కార్యదర్శి జి రామకృష్ణ ఆధ్వర్యంలో సిఎం చంద్రబాబు నాయుడును ఉద్యోగులు కలిశారు.



సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల్లో వారానికి 5 రోజులు పనిదినాలు విధానాన్ని మరో ఏడాది పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంపై  సిఎం చంద్రబాబుకు ఉద్యోగులు ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో పనిలో పనిగా  గత పిఆర్సీ ప్రకటన సందర్భంగా సచివాలయం, హెచ్ వో డిలలో పనిచేసే ఉద్యోగులకు 24శాతం హెచ్ ఆర్ ఏ గడువును పొడిగించాలని విజ్జప్తి చేశారు. పీఆర్సీ లో 24శాతం హెచ్ ఆర్ ఏ ను జూన్ నెలను గడువుగా గత ప్రభుత్వం పేర్కొందని.. దాన్ని పొడిగించాలని విజ్జప్తి చేశారు. తమ అభ్యర్ధనపై సిఎం సానుకూలంగా స్పందించారని ఉద్యోగులు అంటున్నారు. మరి చంద్రన్న కరుణిస్తాడా అన్నది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: