ప్రజాచైతన్యం కోసం సామజిక సమస్యలు పై విప్లవాత్మక సినిమాలు చేస్తూ పీపుల్ స్టార్ అనే బిరుదుని సంపాదించుకున్న నటుడు ఆర్ నారాయణమూర్తి.ఏ విషయాన్ని అయినా ముక్కుసూటిగా మాట్లాడుతూ, చాలా హుషారుగా ఉండే నారాయణమూర్తి.. ఇప్పుడు హాస్పిటల్లో చికిత్స తీసుకుంటున్నారనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేస్తుంది.ఒకప్పుడు వరుస విప్లవ సినిమాలను తెరకెక్కిస్తూ పీపుల్ స్టార్ గా ఎదిగారు నారాయణమూర్తి. అప్పట్లో ఆయన నటించిన చిత్రాలన్నీ బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్లుగా నిలిచాయి. కేవలం సినిమాల్లో నటించడమే కాదు కదా దర్శకత్వం, సంగీతం,గానం ఇలా 24 శాఖల్లో పని చేస్తూ టాలీవుడ్ లో తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. గత కొంతకాలంగా నారాయణమూర్తి తెరకెక్కించిన చిత్రాలు ఏవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు.ప్రముఖ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్నాడు. ఆయన ఆరోగ్యం స్పల్పంగా దెబ్బతినడంతో బుధవారం ఉదయం హైదరాబాద్‌లో నిమ్స్‌ ఆస్పత్రిలో చేరినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు.ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయనకు ఏమైంది, ఎందుకోసం హాస్పిటల్లో చేరారు అనేది తెలియాల్సి ఉంది. ఆర్ నారాయణమూర్తి హాస్పిటల్లో చేరారని విషయం తెలిసి అభిమానులు ఆవేదన చెందుతున్నారు. ఆయన త్వరగా కోలుకొని రావాలని కామెంట్స్ చేస్తున్నారు. చాలా గ్యాప్ తర్వాత ఆయన హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా "యూనివర్సిటీ" గతేడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆ చిత్రం కూడా విజయం సాధించలేదు ప్రస్తుతం ఆయన ఉప్పు సత్యాగ్రహం అనే సినిమాను తెరకెక్కించేందుకు ఉండడంతో ఆరోగ్యం దెబ్బతిన్నట్లు తెలుస్తుంది.కాగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన నారాయణమూర్తి.. పలు చిత్రాలకు దర్శకుడిగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం ఆయన సినిమాల్లో పెద్దగా కనిపించడం లేదు. అడపాదడపా ఒకటిరెండు సినిమాలతో ఆడియన్స్ ని పలకరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: