ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సాంఘిక సంక్షేమం, దివ్యాంగుల, సీనియర్ సిటిజన్స్ సంక్షేమం మరియు సచివాలయం గ్రామ వాలంటీర్ల శాఖ మంత్రివర్యులు గా డా. డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి బాధ్యతలు చేపట్టారు. అంధకారం లో ఉన్న రాష్ట్రాన్ని వెలుగులోకి తీసుకురావడమే లక్ష్యం గా పని చేస్తామని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖామంత్రి డోలా వీరాంజనేయ స్వామి అన్నారు. ప్రజా సమస్యల పట్ల అవగాహనతో ప్రజా ప్రతినిధులు మాట్లాడి ఎన్నో ఎళ్లు అయిందని వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయి లో ఉన్న ఇబ్బందులు, పాలనా వైఫల్యాలను క్షుణ్ణంగా సమీక్షించి ప్రజా పాలనకు శ్రీకారం చుట్టారు. ప్రధానంగా తాగునీటి సమస్యలపై శాసన సభ్యులు ప్రశ్నలు సంధించారు. ఒంగోలు పట్టణంలో తాగునీటి సరఫరా బాగోలేదని, పెర్ణమెట్ట వద్ద రిపేర్లు చేయాల్సి అన్నా పట్టించుకోవడం లేదన్నారు. సాగునీటి ప్రాజెక్ట్లు మెరుగుపరచాలని, గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేట్లు త్వరితగతిన ఏర్పాటు చేయాలని మంత్రి సూచించారు.ఈ నేపథ్యం లో మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి కి ప్రమాదం తృటిలో తప్పింది.జరుగుమల్లి మండలం పాలేటిపాడు లో పోలేరమ్మ తిరుణాల కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లిన మంత్రి.. తిరుణాల సందర్భంగా టీడీపీ నాయకులు కొనుగోలు చేసిన నూతన ఎడ్ల బండిని ప్రారంభిస్తుండగా డీజే సౌండ్లకు బెదిరి ఎద్దులు మంత్రిని ఢీకొన్నాయి.దీంతో బెదిరిపోయిన ఎద్దులు బండిని లాక్కొని ముందుకు వెళ్లాయి. ఆ సమయంలో తూలినపోయిన మంత్రి డోలా ఒక్కసారిగా కిందపడిపోయారు.ఈ క్రమంలో ఎద్దులు ఒక్కసారిగా ఆయన తలపైకి దూకి కిందకు తోసేసాయి.కాళ్లతో తొక్కి ఉంటే పెద్ద ప్రమాదం జరిగి ఉండేది. ఆయనకు స్వల్పగాయాలు కావడంతో అప్రమత్తమైన స్థానిక నాయకులు మంత్రిని అక్కడ్నుంచి తప్పించారు. మంత్రికి పెద్ద ప్రమాదం తప్పడంతో అక్కడున్న భక్తులు, టీడీపీ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం మంత్రి డోలా యధావిధిగా పోలేరమ్మ తిరునాళ్ల పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమం ముగిశాక స్వగ్రామం నాయుడుపాలెంకు మంత్రి వెళ్లిపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: