ఈ చిత్రం ఆగస్ట్ 1 నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ స్ట్రీమింగ్ కానుంది. కరోనా బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ చిత్రం ఇప్పటికే అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్ లో సత్తా చాటింది. హ్యూస్టన్ ఇంటర్నేషన్ ఫిల్మ్ ఫెస్టివల్ 2024 రెమి అవార్డు విజేతగా నిలిచింది డియర్ నాన్న.
చెఫ్ కావాలని కలులు కనే చైతన్య రావ్ తన జీవితంలో ఎదురైన సంఘటనలు, తనలో కలిగిన మార్పుని దర్శకుడు అంజి సలాది ఆలోచన రేకెత్తించే విధంగా ఎఫెక్టివ్ గా ఇందులో చూపించబోతున్నారు. కరోనా సమయంలో మెడికల్ షాప్ ల ప్రాధాన్యత, వారు చేసిన త్యాగాలని అద్భుతంగా చూపించారు. ఫాదర్ ఎమోషన్ సన్ ఎమోషన్ లో ఇందులో మరో హైలెట్. చైతన్య రావ్, సూర్య కుమార్ భగవాన్ దాస్ మధ్య వచ్చే ఎమోషనల్ సీన్స్ ప్రేక్షకులని అలరించబోతున్నాయి.
ఈ చిత్రంలో సివిఎల్ నరసింహ, ఆదిత్య వరుణ్, వినీల్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు. అనిత్ కుమార్ మాధాడి డీవోపీగా పని చేస్తున్న ఈ చిత్రానికి గిఫ్టన్ ఎలియాస్ మ్యూజిక్ డైరెక్టర్. శ్రవణ్ కటికనేని ఎడిటర్.