బోయింగ్ స్టార్ లైనర్ స్పేస్ క్రాఫ్ట్ సురక్షితంగా భూమి మీదకు రావాలంటే..సర్వీస్ మాడ్యూల్ సరిగ్గా అతుక్కోవాలని…క్యాప్సూల్‌ను సరైన కోణంలో అంటిపెట్టుకుంటేనే వారు సేఫ్‌గా భూమికి పైకి తిరిగి రాగలుగుతారని చెబుతున్నారు. మాడ్యూల్ కోణం ఏ మాత్రం సరిగ్గా లేకపోయినా రాపిడి జరిగి మంటలు పుడతాయని రుడీ చెప్పారు. దీనివలన ఆస్ట్రోనాట్స్ మాడి మసవుతారని అంటున్నారు. దీంతో సునీతా విలియమ్స్, బచ్ ల సురక్షితత మీద మరిన్ని అనుమానాలు చెలరేగుతున్నాయి. ఇప్పటికే వారు తిరిగి రావడానికి చాలా టైమ్ పడుతుందని చెబుతున్నారు. దానికి తోడు ఇప్పుడు మరొక భయం ప్రవేశించింది.భారత సంతతికి చెందిన సునీతా విలియమ్స్, వెటరన్ వ్యోమగామి బుచ్ విల్మోర్ జూన్ 5న ఫ్లోరిడాలోని కెన్నెడీ స్పేస్ సెంటర్ నుండి విజయవంతంగా బయలుదేరి జూన్ 22న షెడ్యూల్ ప్రకారం జూన్ 6న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేరుకున్నారు. అయితే వారు ఇప్పటికే భూమికి తిరిగి వచ్చి ఉండాలి. కానీ కొన్ని సాంకేతిక కారణాల లోపంతో ల్యాండింగ్ ఆలస్యమైంది.ఈ సందర్భంలో, సునీత విలియమ్స్ ఎక్కువ రోజులు అంతరిక్షంలో ఉండటం వల్ల బరువు తగ్గడం, కండరాలు ఎముకల సాంద్రత తగ్గడం వంటి సమస్యలను ఎదుర్కోవచ్చు.అంతరిక్షంలో గురుత్వాకర్షణ సున్నాగా ఉంటుంది. దీంతో కండరాలకు ఎముకలకు బరువులు ఎత్తే పని ఉండదు. కాలక్రమేణా, కండరాల ఫైబర్స్ బలహీనపడతాయి. ఎముక కూడా బలహీనపడి విరిగిపోయే అవకాశం ఉంది. రోజంతా అంతరిక్షంలో ఉండడం వల్ల కళ్లపై ఒత్తిడి పెరిగి చూపు మసకబారుతుందని, డబుల్ విజన్ కనిపిస్తోందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.