కోల్‌కతాలోని ఆర్‌జీ కార్‌ మెడికల్‌ కాలేజీకి చెందిన జూనియర్‌ డాక్టర్‌ పై జరిగిన హత్యాచార ఘటన దేశవ్యాప్తం గా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దారుణ ఘటనపై యావత్ దేశం భగ్గుమంటోంది. బాధితురాలి కి న్యాయం జరగగాలంటూ సోషల్‌ మీడియా వేదిక గా పెద్ద ఎత్తున పోస్టింగ్స్‌ చేస్తున్నారు, రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. ఆర్జీ కర్‌ ప్రభుత్వ వైద్య కళాశాలలో విధుల్లో ఉన్న జూనియర్‌ వైద్యురాలి(31)పై అత్యాచారం చేసి హతమార్చిన ఘటన పై విచారణ జరుగుతోంది.ఇక, ఆగస్టు 8న నైట్ డ్యూటీ లో ఉన్న వైద్యురాలిపై.. ఆ రోజు తెల్లవారుజామున 2 నుంచి 3 గంటల మధ్య అత్యాచారానికి పాల్పడిన కామాంధుడు.. అతి దారుణం గా ప్రాణాలు తీశాడు. మర్నాడు ఆగస్ట్ 9 తేదీన సెమినార్ హాల్‌ లో నగ్నంగా పడి ఉన్న ట్రెయినీ డాక్టర్ మృతదేహాన్ని ఆసుపత్రి సిబ్బంది గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే సంజయ్ రాయ్ అనే పౌర వాలంటీర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇప్పటికే ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని కలకత్తా హైకోర్టు మంగళవారం ఆదేశించింది. మరోవైపు, ఈ ఘటనకు నిరసనగా బుధవారం అర్ధరాత్రి కోల్‌కతా లో మహిళలు వినూత్న ఆందోళనకు పిలుపునిచ్చారు.
కోల్‌కతా జూనియర్ డాక్టర్‌ అభయ హత్యాచార ఘటనలో విస్తుపోయే నిజాలు బయటపడుతున్నాయి. నిందితుడు సంజయ్.. అభయపై అఘయిత్యానికి పాల్పడే ముందు రెడ్‌లైట్‌ ఏరియాకు వెళ్లి వచ్చినట్లు విచారణలో తేలింది.ఈ నేపథ్యంలో నిందితుడు సంజయ్ రాయ్ వాంగ్మూలం,ట్రైనీ డాక్టర్ పోస్టుమర్టం రిపోర్టు ఆధారంగా సిబిఐ అధికారులు అతడికి సైకో అనాలసిస్ చేశారు. అందులో విస్తూగోలిపే విషయాలు వెలుగు చూసినట్లు తెలుస్తుంది. వికృతమైన సెక్స్ అలవాట్లకు బానిస అయ్యాడని,జంతువుల ప్రవర్తించేవాడని అధికారులు గుర్తించారు. విచారణలో అతడు ఏమాత్రం భావోద్వేగానికి గురి కాలేదని,ఎలాంటి తొందరపాటు లేకుండా జవాబులు చెప్పాడని తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: