* బెజవాడను చుట్టేసిన 'బుడమేరు'.!

* విజయవాడ కోలోకునేదాకా వెళ్ళేదిలేదంటున్న చంద్రబాబు.!

* వాటర్ బోట్, జేసీబీ, కాలినడకన... పరామర్శ.!

* సీఎం Vs మాజీ సీఎం అని పోలుస్తున్న ప్రజలు.!

(ఏపీ-ఇండియాహెరాల్డ్): గత మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు విజయవాడ నగరం చిన్న పాటి సముద్రాన్ని తలపిస్తుంది. ఎక్కడికక్కడ నదులు, చెరువులు,వాగులు కట్టలు తెగిపోయి నగర వాసుల ఇంట్లోకి వరద నీరు వచ్చి భయబ్రాంతులకి గురి చేస్తున్నాయి.గతంలో ఎప్పుడూలేని విధంగా  పాలకులు, ప్రజలు ఊహించని రీతిలో కుండపోత వర్షం కురిసిన కారణంగా విజయవాడ చిగురుటాకులా వణుకుతోంది.ఇంట్లో వరద నీరు.. బాధితుల కంట్లో కన్నీరుతో పరిస్థితి హృదయవిదారకంగా మారింది. సర్కార్‌ ముందుస్తు చర్యలతో కొంతమేర ప్రాణ, ఆస్తి నష్టం తప్పినా ముంపు ముప్పుతో బాధితులు సహాయక చర్యల కోసం ఎదురుచూస్తున్నారు. ఇటు సర్కార్ కూడా సహాయక చర్యలను ముమ్మరం చేసింది. ఆహారం, వాటర్, మందులను పంపిణీ చేస్తున్నారు. వరద ముంపు నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి విజయవాడ కలెక్టరేట్లోనే చంద్రబాబు బస చేస్తూ ఒకవైపు ఇతర జిల్లాల కలెక్టర్లు, అధికారులతో సమీక్షలు జరుపుతూ విజయవాడలో ముంపు బాధిత ప్రాంతాలను రాత్రి 11 గంటల సమయంలో సైతం ముంపు ప్రాంతాల పరామర్శకు వెళ్లి వేకువ జామున నాలుగు గంటల వరకు అక్కడే గడిపారు.మళ్లీ సోమవారం ఉదయం 9 గంటల నుంచి క్షేత్రస్థాయిలో పర్యటనలకు బయలుదేరారు. అయితే దాంట్లో భాగంగానే నగరంలోని పలు ప్రాంతాలు ఐనా సింగ్ నగర్,యనమలకుదురు, పటమట, రామలింగేశ్వర నగర్‌, జక్కంపూడి, భవానీపురం  సీఎం చంద్రబాబు స్వయంగా పర్యటించి బాధితులకు ధైర్యాన్ని ఇచ్చారు.

ప్రకాశం బ్యారేజీ దిగువ లోతట్టు ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల్లోనూ వాహనం వెళ్ళగలిగే అంత దూరం పర్యటించి అక్కడ నుండి మిగిలిన చోట్లకి కాలినడక వెళ్లారు. కొన్నిచోట్ల మోకాలి లోతు నీటిలోనూ నడుచుకుంటూ వెళ్లారు. బురదలో కాలినడకనే తన పర్యటనను కొనసాగించారు. మరింత ఎక్కువ నీరు ఉన్న ప్రాంతాల్లో బోటు ద్వారా బాధితుల వద్దకు చేరుకుని వారితో స్వయంగా మాట్లాడి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులు చెప్పే ఫిర్యాదుల పరిష్కారానికి ఎప్పటికప్పుడు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వం ఆదుకుంటుందని ధైర్యంగా ఉండాలంటూ ప్రజల్లో భరోసా కల్పించారు చంద్రబాబు.అనంతరం విజయవాడ కలెక్టరేట్‌లో మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి ఊహించని విపత్తు నుంచి ప్రజలను త్వరగా కాపాడాలని అధికారులకు సూచించారు. ప్రజల భద్రత తమ బాధ్యత అని, బాధితులు ధైర్యంగా ఉండాలని కోరారు.అలాగే సోమవారం నాడు కూడా చంద్రబాబు అక్కడే బస చేసి ఈసారి జేసీబీ సాయంతో పర్యటించి బాధితులను పరామర్శించారు.నేరుగా బాధితుల వద్దకు వెళ్లి వారి కష్టనష్టాలు తెలుసుకున్నారు. నేనున్నానంటూ వారికి భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని, కొన్ని గంటల్లో పరిస్థితిని చక్కదిద్దుతానని హామీ ఇచ్చారు.

ఓ వైపు పరామర్శలు, మరోవైపు సహాయక చర్యలను చంద్రబాబు సమాంతరంగా పర్యవేక్షిస్తూ ముందుకు సాగారు. అక్కడిక్కడే అధికారులకు, క్షేత్రస్థాయి సిబ్బందికి సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.అయితే ముఖ్యంగా సింగ్ నగర్ లో పరిస్థితి వర్ణించలేని విధంగా ఉంది.సింగ్‌నగర్‌లో ఆర్తనాదాలు వినిపిస్తున్నాయి. ఆహారం లేక జనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గర్భిణీలు, రోగులు అవస్థలు పడుతున్నారు.ఈ నేపథ్యంలో ముంపు ప్రాంతాల్లో 5 హెలికాప్టర్లు, డ్రోన్‌లతో ఆహారం సరఫరా చేస్తున్నారు కానీ అవి అందరికీ అందడం లేదు. పలు కాలనీలకు ఇంకా తాగునీరు చేరలేదు. రెండు రోజులుగా సిగ్నల్స్ లేక ఫోన్లు కూడా పనిచేయడం లేదు.మరోవైపు ముంపు ప్రాంతాల వాసులకు పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు.176 కేంద్రాల్లో 50 వేల మందికి పైగా వరద బాధితులు ఆశ్రయం పొందుతున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో మొత్తం దాదాపు 170పైగా వైద్య శిబిరాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యల్లో 40కు పైగా ఎన్డీఆర్‌ బృందాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు పాల్గొన్నాయి. 200 బోట్లు అందుబాటులో ఉన్నాయి. దాదాపు 300 మంది గజఈతగాళ్లు కూడా ఉన్నారు.ఈ వరదల వల్ల మాత్రం ప్రజలకు గత సీఎం vs నేటి సీఎం అని ప్రజలు పోల్చుకుంటున్నారు. గత ప్రభుత్వంలో ఇలాంటి ఒక విపత్తు సంభవిస్తే జగన్ మాత్రం హెలికాప్టర్లో ఏరియల్ సర్వే చేసి ఉండేవారు కానీ ప్రజల్లోకి ప్రస్తుత సీఎం చంద్రబాబు మాదిరిగా వరద బాధితులను పట్టించుకునేవారుకాదు. చంద్రబాబు మాత్రం తన వయసును సైతం పక్కన పెట్టి అహర్నిశలు మూడు రోజులుగా ప్రజల్లో మమేకమై వారి కష్టాలను తెల్సుకుంటూ వారికీ అండగా నిలుస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: