ప్రజలను భారీ వరదలు మూడు రోజులుగా కంటి మీద కునుకు లేకుండా చేశాయి. ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ నెమ్మదిగా శాంతిస్తోంది. ఈ మధ్యాహ్నం వరకు మరింత తగ్గుతుందని ఇరిగేషన్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఎన్నడూ లేనంతగా 11.47లక్షల క్యూసెక్కుల నీరు చేరడంతో చరిత్రలో ఇదే రికార్డు స్థాయి నీటి ప్రవాహమని, అయినప్పటికీ ప్రకాశం బ్యారేజీ తట్టుకుని నిలబడిందని అధికారులు చెప్పారు. అయితే ఇవాళ వరద ప్రవాహం కాస్త తగ్గుముఖం పట్టింది.ఈ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ సహా ఇతర రాష్ట్రాల్లో ప్రజలకు ఏ చిన్న కష్టమొచ్చినా.. మేమున్నామంటూ తెలుగు హీరోలు ఎపుడు ముందుంటారు. ఈ నేపథ్యంలో  గత కొన్ని రోజులుగా వరదలతో అల్లాడుతున్న తెలుగు రాష్ట్రాలను ఆదుకోవడానికి మన హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొస్తున్నారు. వరదల నేపథ్యంలో  సర్వం కోల్పోయి రోడ్డున పడ్డ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఆదుకునేందుకు తమ వంతుగా భారీ ఆర్ధిక సాయాన్ని అందిస్తున్నారు.రెండు రాష్ట్రాల్లో జరిగిన వరద పరిస్థితిని చూసి పలువురు సెలబ్రిటీలు చలించిపోయి భారీ విరాళాలను ప్రకటిస్తున్నారు.ప్రభాస్.. ఈ పేరు వింటే స్టార్ డమ్‌తో పాటు మంచితనం కనిపిస్తుంది. ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో ఇప్పటివరకు ప్రభాస్‌పై ఒక్క మచ్చ లేదు. అసలు ఎంతో మంది గొప్ప గొప్ప నటులు సైతం ప్రభాస్ మంచితనం గురించి గొప్పగా చెబుతుంటారు.తాజాగా రెబల్ స్టార్ ప్రభాస్ వరదబాధితులను ఆదుకునేందుకు భారీ విరాళం ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకి రూ.2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించారు ప్రభాస్. అలాగే వరదలకు గురైన ప్రాంతలో ప్రజలకి భోజనాలు, మంచి నీళ్లు ఏర్పాటు చేశారు ప్రభాస్. ప్రభాస్ రూ.2 కోట్ల రూపాయలు విరాళం ప్రకటించడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్ కు చెరో కోటి రూపాయల చొప్పున విరాళం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రభాస్ కలియుగ కర్ణుడు, రాజులకే రాజు అని అభిమానులు కొనియాడుతున్నారు. విరాళాలు ఇవ్వడాన్ని ఎన్టీఆర్ స్టార్ట్ చేయగా అందరికంటే ఎక్కువ ప్రభాస్ డొనేట్ చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: