ప్రస్తుతం గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. ఈ క్రమంలోనే వేలాదిమంది నిరాశ్రయులై.. రోడ్లపైకి వచ్చేశారు. తాగడానికి మంచినీరు, తినడానికి భోజనం లేక అవస్థలు పడుతున్నారు. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ప్రముఖులు వరద బాధితులకు అండగా నిలుస్తున్నారు. తమ వంతు సాయాన్ని ప్రకటిస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ నాయకులే కాకుండా సినీ సెలబ్రిటీలు, బిజినెస్‌మెన్‌లు ముందుకు వచ్చి.. భారీగా ఆర్థిక సహాయం చేస్తున్నారు.తాజాగా సినీ నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం వరద బాధితుల కోసం భారీ విరాళాన్ని ప్రకటించారు. తెలంగాణకు రూ. కోటిని సీఎంకు స్వయాన అందజేస్తానని తెలిపారు. దీంతో తెలంగాణ‌లో ప‌వ‌న్ అభిమానులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆప‌త్కాలంలో ప‌వ‌న్ క‌ళ్యాణ అండ‌గా నిల‌బ‌డ్డార‌ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పోస్టులు పెడుతున్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తనవంతుగా లక్ష రూపాయల చొప్పున రూ. 4 కోట్లు,ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఏపీకి కూడా భారీగా విరాళం ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అలాగే ఏపీలోని 400 గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య నిర్వహణకు తనవంతుగా లక్ష రూపాయల చొప్పున అందజేస్తానని ప్రకటించారు.పంచాయతీ రాజ్‌ ఉద్యోగులు, ఇంజినీర్లు విరాళం ప్రకటించడం పట్ల అభినందించారు. 2014-19లో వచ్చిన హుదాహుద్‌ తుఫాన్‌ ప్రభావం వల్ల నష్టపోయిన బాధితులకు రూ. 50 లక్షలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. ఏపీలో వరదల వల్ల 29 మంది ప్రాణాలు కోల్పోయ్యారని, ఇద్దరు గల్లంతయ్యారని, 200 పశువులు , వేల సంఖ్యలో కోళ్లు చనిపోయాయని తెలిపారు.అలాగే 131 కేంద్రాల్లో పశువులకు చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేశామని వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షా 69 వేల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలిపారు. 233 కిలోమీటర్ల పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయని అన్నారు. వరద ఉదృతి తగ్గిన తరువాత రోడ్లు, కల్వర్ట్లు బాగు చేస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: