* బెజవాడలో పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మా.!
* భయపెడుతూ హెచ్చరిస్తున్న కృష్ణమ్మా.!
* పురాణాల ప్రకారం బెజవాడకు ముప్పు ఖాయమా.?
* కృష్ణమ్మా Vs దుర్గమ్మ సంబంధం..?

(ఏపీ-ఇండియాహెరాల్డ్): తెలుగు వారు ఆప్యాయంగా కృష్ణవేణి అని పిలుచుకునే కృష్ణానది భారతదేశంలోని అత్యంత పొడవైన నదుల్లో మూడవది. దక్షిణ భారతదేశంలో రెండో పెద్ద నది.నీటి ప్రవాహం సెకనుకు అనేది 2213 మీ3 ఉంటూ దేశంలో కెల్లా నాలుగవ పెద్ద నది.పడమటి కనులలో మహారాష్ట్ర లోని మహాబలేశ్వరంలో చిన్న ధారగా పుట్టి ఆపై అనేక ఉపనదులను కలుపుకుంటూ మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను సస్యశ్యామలం చేసుకుంటా మొత్తం1,400 కి. మీ. ప్రయాణించి దివిసీమలోని హంసల దీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.
2009 అక్టోబరులో కృష్ణానదికి వచ్చిన వరదల్లో దాదాపు 350 గ్రామాలు మునిగిపోయి లక్షల మంది నిరాశ్రయులయ్యారు.అలాంటి వరదని ఇప్పటికి వెయ్యేళ్ళ వరదగా అంటుంటారు.దాని ప్రభావం కర్నూలు, మహబూబ్ నగర్, గుంటూరు, కృష్ణా, నల్గొండ జిల్లాల్లో ఈ వరద బీభత్సం సృష్టించింది. మరీ కర్నూలు నగరం మొత్తం దాదాపు 3 రోజుల పాటు 3 మీటర్ల వరద నీటిలో మునిగిపోయి ఉంది.శ్రీశైలం ప్రాజెక్ట్  పైనుండి కృష్ణ పరవళ్లు తొక్కింది అంటే పరిస్థితి ఎలా ఉందొ ఉహించవచ్చు.ప్రకాశం బ్యారేజీ వద్ద 11,10,000 క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 1903 లో నమోదైన 10,80,000 క్యూసెక్కుల ప్రవాహ రికార్డును ఇది మించిపోయింది. అయితే ప్రస్తుతం గతంలో ఎన్నడూ లేని విధంగా కృష్ణానదిలో ప్రవహిస్తున్న నీటి ప్రవాహం చూసి ప్రజలు భయభ్రంతులకి గురి అవుతున్నారు.పక్కనే ఉన్న రీటైనింగ్ వాల్అనేది నదిలోని నీరు ఊరి మీద పడకుండా ఆధారంగా నిల్చిందని అంటున్నారు.

అయితే ఈ వరదల కారణంగా ప్రజలు వీరబ్రహ్మస్వామి చెప్పిన మాటలు గుర్తుకు తెచ్చుకుంటున్నారు దాంతో కృష్ణమ్మా శాంతించు అంటూ పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మాకు పూజలు చేస్తున్నారు. అయితే పురాణాల్లో కృష్ణమ్మా మీద ఉన్న కధ ప్రకారం కృష్ణ నది శ్రీ మహా విష్ణువు యొక్క అంశగా చెప్తారు. కలియుగ ప్రారంభంలో జనులను తరింపచేయడానికి విష్ణువు కృష్ణ ను సృష్టించి బ్రహ్మ కి ఇచ్చారని ఆ తర్వాత కలియుగం పాపభూయిష్టం అవడంతో విష్ణువు ఆమెను మరలా బ్రహ్మ నుంచి గైకొని దేవతలకు ఇస్తారని పురాణాలూ చెప్తున్నాయి.అయితే కృష్ణ ను భూమి మీదకు ప్రవేశ పెట్టడానికి సరైన స్థానం కోసం, వెతుకగా పర్వత రూపంలో తపస్సు చేస్తున్న సహ్య ముని కనిపిస్తారు.దేవతలు ఆయన వద్దకు వెళ్ళి కృష్ణ వృత్తాంతం వివరించగానే అయన పరమానంద భరితుడై కృష్ణ ను తన పై భరించడానికి అంగీకరిస్తారు.శ్రీ మహా విష్ణువు శ్వేతాశ్వత్థ వృక్షం గా సహ్యాద్రి పై అవతరించారని ఆ రావి చెట్టు అంతర్భాగాన రెండు వైపులా ధవళాకృతి లో నదీమ తల్లిగా కృష్ణ ఆవిర్భవించింది.పడమటి కనుమల్లో బ్రహ్మగిరి, వేదగిరి అని రెండు శిఖరాలున్నాయి. వీటిలో బ్రహ్మగిరి మీద బ్రహ్మ తపస్సు కి మెచ్చి విష్ణువు శ్వేతాశ్వత్థ వృక్షం గాప్రత్యక్షమయ్యాడు.ఇక వేదగిరి మీద బ్రహ్మ గారి తపస్సు కి మెచ్చి శివుడు ఉసిరి వృక్షంగా ప్రత్యక్షమయ్యారు.శ్వేతాశ్వత్థ వృక్షం కృష్ణ గానూ, అమలక వృక్షం వేణి గానూ ఒక దానితో ఒకటి కలిసి కృష్ణవేణి గా నదిగా అవతరించిందని విష్ణు పురాణం కథనం.

ఈ నదీ జలాలు సహ్యాద్రి నుంచి శ్రీ శైలం వరకూ ప్రవహిస్తూ, అనేక ఆధ్యాత్మిక సంపదను తమలో నింపుకున్నాయి.ఇక సహ్యాద్రిలో మొదలైన ఈ జలాలు కీలాద్రి వద్దకు రాగానే ముందుకు సాగలేక ఆగిపోయాయి. అయితే ఈ జలాల్లో ఉన్న అనేక మూలికల వల్ల ఆ ప్రాంతం సస్యశ్యామలంగా మారిపోయింది.ఇక దేవతల అభ్యర్ధనతో కృష్ణ కు కీలుడు సొరంగ మార్గం ద్వారా దారి ఇవ్వగా ,ఆ ప్రవాహ వేగంలో కొండ ఒక ముక్క విరిగి రెండు క్రోసుల దూరంలో కొట్టుకుపోయి నిలిచింది.ఆ రెండు క్రోసుల దూరాన్నే ఫల్గుణ తీర్థంగా, ఆ కొండ ముక్కని తేలుకొండ అని సహ్యాద్రి పురాణం కథనం.. అది యనమలకుదురు అని ఇంద్రకీలాద్రి ప్రక్క గ్రామం, ఇది మంగళగిరి వరకూ వ్యాపించి ఉంది.ఇక ఈ కథనం ప్రకారం అమ్మ వారు వెలిసిన కొండ కీలాద్రి కృష్ణ నది ప్రవాహం వల్ల తొలవబడింది.. ఆ కొండ లో సొరంగం ద్వారా నదీ ప్రవహాం ఉంది ..శ్రీ పోతులూరి వీరబ్రహ్మమేంద్ర స్వామి వారి కాలజ్ఞానం లో చెప్పినట్టుగా కొండ లోపల మీదుగా ప్రవహిస్తున్న కృష్ణ నదీ జలాలు , కొండ పైన వెలిసిన అమ్మ వారి విగ్రహానికి ఉన్న ముక్కు పుడక ని తాకుతాయి అంటే అది ఏ స్థాయి ప్రళయమో అనేది ఊహించుకుంటేనే భయమేస్తుందని విజయవాడ ప్రజల్లో ఆధ్యాత్మిక పండితులు భయపడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: