తెలంగాణ ఉపాధ్యాయ నియామక పరీక్ష 2024 రాసిన అభ్యర్ధులు ఫలితాల కోసం వేయికళ్లతో ఎదురు చూస్తున్నారు. డీఎస్సీ పరీక్షల ప్రాథమిక 'కీ'లపై భారీగా అభ్యంతరాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఏకంగా 28 వేలకుపైగా అభ్యంతరాలు అందాయి. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా… ఈసారి జరిగిన పరీక్షపై అత్యధిక స్థాయిలో అభ్యంతరాలు వచ్చాయి. వీటిని పరిశీలించిన విద్యాశాఖ…. శుక్రవారం ఫైనల్ కీని ప్రకటించింది.ఆగస్టు 13న రెస్పాన్స్ షీట్లు, ప్రిలిమినరీ కీని విద్యాశాఖ విడుదల చేసింది. ఆగస్టు 20వ తేదీతో అభ్యంతరాల స్వీకరణ గడువు ముగిసింది. దాదాపు 10 రోజులకుపైగా అభ్యంతరాల పరిశీలను చేపట్టింది. ఫైనల్ కీ విడుదల కావటంతో త్వరలోనే అనగా3,4రోజుల్లో ఫలితాలు వెల్లడించేందుకు సిద్ధమవుతుంది. ఈ పరీక్షలలో మార్కులు టెట్లో వచ్చిన మార్కుల వెయిటేజ్ ని కలిపి డీఎస్సీ ఫలితాలు విడుదల చేయనుంది. అనంతరం జిల్లాల వారీగా మెరిట్ జాబితా వెల్లడి చేయనున్నారు. మెరిట్‌ జాబితా జారీ విడుదల తర్వాత ధ్రువపత్రాల పరిశీలన చేపట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిలా ఉండగా పిలిమినరీ కీతో పోలిస్తే ఫైనల్ కీ లో 109 ప్రశ్నలకు జవాబులు మార్చినట్లు తెలుస్తుంది. 50 ప్రశ్నలకు ఆన్సర్స్ సరిగా లేకపోవడంతో వాటికి మార్కులు జత చేశారు.సాధ్యమైనంత త్వరగా కొత్త టీచర్ల సేవలను వాడుకోవాలన్న ఉద్దేశ్యంతో సర్కార్ ఉంది. ఈ విషయంలో ఓ డెడ్ లైన్ కూడా పెట్టుకుని పని చేస్తోంది.

ఇదిలావుండగా ఫలితాల విడుదలపై డిప్యూటీ సీఎం భట్టి గురువారం కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కొత్త డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలవుతుందన్నారు. ఇప్పటికే నిర్వహించిన పరీక్షల ఫలితాలు వారం రోజుల్లో విడుదలవుతాయని చెప్పుకొచ్చారు. దీంతో అతి తొందర్లోనే డీఎస్సీ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది.ఇదిలావుండగా ఫలితాల వెల్లడికి సంబంధించిన మొత్తం ప్రక్రియను పూర్తి చేసిన అధికారులు మరోసారి చెక్‌ చేసేందుకు ఇప్పటికే టీఎస్‌ ఆన్‌లైన్‌కు ఆ వివరాలను పంపారు. అభ్యర్థులు ఎవరికి వారు తుది కీ ప్రకారం తమకు పరీక్షల్లో ఎన్ని మార్కులు వచ్చాయో తెలుసుకోవచ్చు. కీ వెల్లడైన తర్వాత రెండు మూడు రోజుల్లో డీఎస్సీ 80 మార్కులకు, టెట్‌ 20 మార్కులను కలిపి జిల్లాల వారీగా జనరల్‌ ర్యాంకు లిస్టును విడుదల చేయనున్నారు. తదనంతరం రిజర్వేషన్ల ప్రకారం 1:3 నిష్పత్తిలో మెరిట్‌ జాబితాను ప్రకటిస్తారు. వీరందరికీ డీఈఓలు ధ్రువపత్రాల పరిశీలన చేపడతారు. అనంతరం మెరిట్‌ ఉన్న వారికి నియామక పత్రాలు అందజేస్తారు.

మరింత సమాచారం తెలుసుకోండి: