తెలంగాణ, ఏపీలో ఇటీవల భారీగా వర్షాలు కురిశాయి. ఎడతెరిపిలేని భారీ వర్షాల కారణంగా వరదలు సంభవించాయి. నదులు, వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లాయి. దీంతో పలు ప్రాంతాల్లో వరద ముంచెత్తింది. ముఖ్యంగా ఏపీలోని విజయవాడ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలపై వరదల ప్రభావం తీవ్రంగా పడింది. ఇటు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్, ములుగు, కామారెడ్డి జిల్లాలపై వరదలు భారీగా ప్రభావం చూపాయి. ఇరు రాష్ట్రాల వర్షాలు, వరదల కారణంగా పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలను కోల్పోయారు. వేల ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. రూ. వందల కోట్ల ఆస్తి నష్టం జరిగింది.ఇదిలావుండగా వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు టిలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వరద బాధితుల కష్టాలు తీర్చేందుకు అవిశ్రాంతంగా పని చేస్తున్నామన్నారు. నిత్యావసరాల పంపిణీ, పారిశుద్ధ్య పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. రేపు సాయంత్రానికి వరద తగ్గిపోతుందని తెలిపారు.టీజీ లో పడే వర్షాల వల్ల ఏపీ కి కొంత వరద వచ్చే అవకాశం ఉందని, దీనికి అధికారులు సిద్ధంగా వుండాలని సీఎం సూచించారు.ఇదిలా ఉండగా.. శుక్రవారం బుడమేరు, కృష్ణా పరివాహక ప్రాంతంలో చంద్రబాబు ఏరియల్ సర్వే చేశారు. 

బుడమేరుకి పడిన గండిని పూడ్చే పనులు ముమ్మరం చేశాం. ఇప్పటికే ఆర్మీ కూడా వచ్చిందని, శనివారం నాటికి మూడో గండి పూడ్చే విధంగా పనులు జరుగుతున్నాయని తెలిపారు. ‘బుడమేరు బ్రిడ్జి క్లోజ్ చేయాలి. దానివల్ల వచ్చే నీరు ఆగుతుంది. అప్పుడే పనులు సులువుగా చేయవచ్చు. ఆరోరోజు నిర్విరామంగా పనిచేసినా, మళ్లీ వర్షం కారణంగా నీటి ఫ్లో పెరిగింది. దాంతో కొన్ని ప్రాంతాల్లో నీటి పరిమాణం పెరిగింది. చాలా శ్రమించి, సర్వశక్తులు ఒడ్డి.. ఓ మంత్రి, ఆర్మీ మూడో గండి పూడ్చే పనుల్లో బిజీగా ఉన్నారు.7100 మంది సానిటేషన్ వర్కర్స్ 24 గంటలు పని చేస్తున్నారు. 12 వేల మెట్రిక్ టన్నుల వేస్ట్ ని డిస్పోజ్ చేశాం. 458 కిలోమీటర్ల రోడ్డు క్లీన్ చేపించాం. 110 ఫైర్ ఇంజిన్లు పనిచేస్తున్నాయి. 10 వేల టార్గెట్ పెట్టుకోగా ఇప్పటికీ 4వేల ఇండ్ల పని పూర్తయింది. విద్యుత్ ను తిరిగి తీసుకొచ్చాం. షార్ట్ సర్క్యూట్ అవుతుందన్న కారణంగా కొన్ని ఇండ్లకు విద్యుత్ ఇవ్వడం లేదు. 160 మెడికల్ క్యాంపులు పెట్టి, 54 వేల మంది వరకు ట్రీట్మెంట్ అందించాం ,ని సీఎం సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: