కూటమి సర్కార్‌ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం చంద్రబాబు నాయుడు మెగా డీఎస్సీ పై తొలి సంతకం చేశారు. 16,347 పోస్టుల భర్తీకి మెగా డిఎస్సీ ఫైల్ పై ఆయన తొలి సంతకం పెట్టారు. ఎన్నికలవేళ ఇచ్చిన హామీ ప్రకారం ఈ మొత్తం ప్రక్రియను ఆరు నెలల్లో పూర్తి చేయాలని కసరత్తు ప్రారంభించిన సంగతి తెలిసిందే.ఇందుకు సంబంధించిన మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ త్వరలోనే వెలువడనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే టెట్ పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది. వచ్చే నెల 3 నుంచి 20వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. టెట్ ప్రక్రియ ముగిశాక వెంటనే డీఎస్సీ నియామక ప్రక్రియ ప్రారంభమవుతుంది.అందులో ఎస్‌జీటీ 6,371, స్కూల్ అసిస్టెంట్స్ 7,725, టీజీటీ 1,781, పీజీటీ 286, పీఈటీ 132, ప్రిన్సిప‌ల్స్ 52 పోస్టులున్నాయి. వీటితో పాటు రెసిడెన్షియ‌ల్‌, మోడ‌ల్ స్కూళ్లు, బీసీ, గిరిజ‌న స్కూళ్ల‌లో 2,281 ఖాళీలున్నాయి. 16,347 పోస్టుల‌ను మెగా డీఎస్సీ ద్వారా భ‌ర్తీ చేయ‌నున్నారు. పూర్తిస్థాయి నోటిఫికేషన్‌ విడుదలైన తర్వాత ఈ అంశంపై స్పష్టత వస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు ఉచిత డీఎస్సీ శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.ఈ నేపథ్యంలోఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని గిరిజన అభ్యర్థులకు శుభవార్త కు చెప్పింది.అర్హత కలిగి ఉన్నత చదువులు, ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలని పట్టుదలతో ఉన్నవారికి ఉచిత ట్రైనింగ్ సదుపాయం కల్పించనున్నట్లు ప్రకటించింది.ఈ నేపథ్యంలోనే డీఎస్సీ కు శిక్షణ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఏజెన్సీ ప్రాంతాల్లోని 6 ఐటీడీఏల్లో గిరిజనేతరుల ప్రాంతాల్లో రెండు లేదా మూడు సెంటర్లు ఏర్పాటు చేయనుంది. ఒక్కో కేంద్రంలో 150 మందికి శిక్షణ ఇవ్వనున్నారు. ఇలా మూడు నెలల పాటు సాగే శిక్షణకు ఒక్కో అభ్యర్థికి రూ.25 వేల వరకు ఖర్చు కానుంది.దీనిని రాష్ట్ర ప్రభుత్వమే భరించనున్నట్లు పేర్కొంది. ఇదిలాఉండగా, రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఈ ట్రైనింగ్ ప్రక్రియ తేదీలను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: