వైసీపీ ప్రభుత్వం 2019లో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. 2020 నుంచి ఉద్యోగ నియామకాలు చేపట్టింది.వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 15 వేల గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 1,26,000 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.ఈ నేపథ్యంలో టీడీపీ నేతృత్వంలో కూటమి ప్రభుత్వంఏర్పడిన తర్వాత ఏపీలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు పింఛన్ల పంపిణీ బాధ్యతలను అప్పగించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చంద్రబాబు సర్కార్ కీలక ఆదేశాలు జారిచేసింది.తాజాగా ప్రభుత్వ పాఠశాలల్లో టాయిలెట్ల పరిశుభ్రత ఫొటోలను అప్ లోడ్ చేసే బాధ్యతను కూడా గ్రామ, వార్డు సచివాలయాలకు విద్యాశాఖ అప్పగించింది.ప్రతి సోమ, గురువారాల్లో ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అసిస్టెంట్, వార్డు ఎడ్యుకేషన్ కార్యదర్శి స్కూళ్లను సందర్శించాలని, మరుగుదొడ్ల ఫొటోలను తీసి అప్ లోడ్ చేయాలని విద్యాశాఖ ఆదేశించింది. ఇందు కోసం ఐఎంఎంఎస్ యాప్ లో లాగిన్ అయ్యేందుకు వారికి అవకాశం ఇచ్చింది.ఈ నేపథ్యంలోనే మరోసారి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది.ఉద్యోగులు రోజులో మూడు సార్లు కచ్చితంగా బయోమెట్రిక్ హాజరు నమోదు చేయాలని ఆదేశించింది. ప్రతి రోజూ ఉదయం 10.30 గంటలకు ముందు, మధ్యాహ్నం 3 గం.లకు, సాయంత్రం 5 గంటల తర్వాత హాజరు వేయాలని జీవో జారీ చేసింది. అయితే గత ప్రభుత్వ హయాంలోనే ఈ నిబంధన ఉండగా, బయోమెట్రిక్ విధానం సరిగ్గా అమలు కావడంలేదన్న ఆరోపణలతో...తాజాగా ఈ ఆదేశాలు జారీ చేసింది. ఇక నుంచి రోజుకు మూడుసార్లు హాజరు కచ్చితంగా అమలు చేయాలని స్పష్టం చేసింది. ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు హాజరు ప్రక్రియను పర్యవేక్షించనున్నారు.ఇదిలావుండగా గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. ముందుగా ఆగస్టు 31వ వరకు బదిలీలకు అవకాశం కల్పించగా... పెన్షన్ల పంపిణీ, వర్షాల నేపథ్యంలో బదిలీల ప్రక్రియను సెప్టెంబర్ 15వ వరకు పొడిగించారు. బదిలీలు కోరుకునే ఉద్యోగులు తమ వివరాలతో ఆన్‌లైన్‌ లో గ్రామ, వార్డు సచివాలయాల శాఖ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: