ఇంద్రజిత్ సుకుమారన్, మనోజ్, కే.జయన్ ప్రధాన పాత్రలో నటించిన మలయాలం స్పోర్స్ట్ డ్రామా మూవీ ఆహా.  ది బిబిన్ పాల్ శామ్యూల్ దర్శకత్వం వహించారు. ఇది మళయాలంలో సూపర్ హిట్ అయింది. ఇప్పుడు తెలుగులో ఓటీటీ  ప్లాట్ ఫాం ఆహాలో  స్ర్టీమ్ అవుతోంది. 


Zsa zsa ప్రొడక్షన్ బ్యానర్ పై ప్రేమ్ అబ్రహం నిర్మించిన ఈ చిత్రానికి సయనోరా ఫిలిప్, షియాద్ కబీర్ సంగీతం అందించారు. 1980, 1990లో బాగా ప్రాచుర్యం పొందిన టగ్ ఆఫ్ వార్ టీం నుంచి ప్రేరణ పొంది రూపొందిన ఈ చిత్రం అందరి ప్రశంసలు అందుకుంది.  తాజాగా ఈ చిత్రం భవానీ మీడియా ద్వారా ఆహా ఓటీటీలో స్ర్టీమింగ్ అవుతోంది. అయితే ఆహాలో విడుదల అయిన కొన్ని గంటల్లోనే ఈ చిత్రానికి అదిరిపోయే స్పందన వచ్చింది.  ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ తో దూసుకుపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి:

aha