ఆర్ వి వి మూవీస్ పతాకంపూఐ శ్రీమతి ఆర్ పార్వతీదేవి సమర్పణలో నరేశ్‌ డెక్కల దర్శకత్వంలో ఆర్ వి వి సత్యనారాయణ నటించి నిర్మించిన చిత్రం మన్యం ధీరుడు. ఆర్ వి వి సత్యనారాయణ అల్లూరి సీతారామరాజు పాత్రలో అత్యంత అద్భుతంగా నటన ప్రదర్శించినటువంటి ఈ చిత్రం సెప్టెంబరు 20న విడుదలకు సిద్ధమైంది. అరకు, పాడేరు, హిమచల్ ప్రదేశ్, కాశ్మీర్ ప్రదేశాల్లో చిత్ర నిర్మాణం పూర్తి చేసుకుంది.


అల్లూరి సీతారామరాజు నిజ రూప చరిత్రను వెండి తెరపై ఆవిష్కరించడానికి నటులు ఆర్ వి వి సత్యనారాయన గుర్రపు స్వారీ, కత్తి యుద్ధం, విల్లు విద్య లో శిక్షణ తీసుకున్నారు. మన్యం ధీరుడు చిత్రంలో యదార్థ సన్నివేశాలు, యదార్థ సంఘటలను ప్రజలకు అందించాలనే సంకల్పంతో ఆర్ వి వి సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. బానిస సంకెళ్లు తెంచుకొని బ్రిటీష్ తెల్లదొరల పాలనకు చరమగీతం పాడే సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచే విధంగా ఉంటాయి.


ఈ చిత్రం కోసం భారీ ఖర్చుతో ఒక ఊరినే నిర్మించి అక్కడ షూట్ చేయడానికి సాహసోపేతమైనటువంటి సన్నివేశాలు ఎన్నో మన కళ్లకు కట్టినట్లు చూపించే చిత్రం మన్యం ధీరుడు. ఈ చిత్రానికి సంగీతం పవన్ కుమార్, కెమెరా వినీత్ ఆర్య మరియు ఫరూక్, ఎడిటర్ శ్యాం కుమార్.

మరింత సమాచారం తెలుసుకోండి: