ఏదో చేయాలన్న అనవసర ఆరాటం లేనిపోని తిప్పల్ని తీసుకొస్తూ ఉంటుంది. తాజాగా అలాంటి పరిస్థితిని కొని తెచ్చుకుంది కేరళ ప్రభుత్వం. అయ్యప్త స్వామి దర్శనం కోసం దేశ వ్యాప్తంగా వచ్చే భక్తులకు ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ పేరుతో కఠిన నిబంధనను తీసుకొచ్చిన వైనంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి.


దీంతో పినరయి సర్కారు కొంత వెనక్కి తగ్గింది. అయ్యప్ప భక్తులు స్వామి దర్శననానికి ముందే ఆన్ లైన్ రిజిస్ర్టేషన్ చేయించుకోవాలన్న రూల్ ని ఎత్తి వేస్తూ.. నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుంచి వెల్లువెత్తిన తీవ్ర నిరసనల నేపథ్యంలో తగ్గిర కేరళ సర్కారు ఆన్ లైన్ లో నమోదు చేసుకోకున్నా భక్తులకు దర్శనం కల్పిస్తామని చెప్పింది. ఈ మేరకు కేరళ సీఎం పినరన్ విజయన్ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.


వర్చువల్ నమోదు గురించి తెలియకుండా వచ్చిన వారికి దర్శనం ఉంటుందన్న సీఎం.. ప్రమాదానికి గురైనప్పుడు తప్పి పోయినప్పుడు భక్తులను గుర్తించేందుకు ఆన్ లైన్ నమోదు ఉపయోగపడుతుందన్నారు.


 ఇక ఈ విధానం తిరుపతిలోను అమల్లో  ఉందని కేరళ సీఎం.. గత ఏడాది మాదిరే స్పాట్ బుకింగ్ విధానాన్ని కొనసాగిస్తారా లేదా అనే విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మొత్తంగా అయ్యప్ప భక్తులు దర్శనానికి ఆన్ లైన్ లో మాత్రమే నమోదు చేసే అంశంపై మాత్రం పినరయ్ విజయన్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది.

మరింత సమాచారం తెలుసుకోండి: