ప్రేక్షకులను అలరించే అద్భుతమైన కంటెంట్ ని అందిస్తున్న ఆహా ఓటీటీలో మరో ఎక్సయిటింగ్ మూవీ స్ర్టీమింగ్ లోకి వస్తోంది. విక్రమ్ ప్రభు, శ్రీ దివ్య లీడ్ రోల్స్ లో నటించిన బ్లాక్ బ్లస్టర్ యాక్షన్ థ్రిల్లర్ రైడ్.  సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ నటించిన కన్నడ సూపర్ హిట్ టగరు సినిమాకి రిమేక్ ఇది.


కార్తీ దర్శకత్వం వహించిన ఈ మూవీ ఇప్పటికే తమిళ్  లో విడుదల అయి సూపర్ హిట్ అయింది. ఎక్సయిటింగ్ ధ్రిల్ యాక్షన్ తో ఆడియన్స్ ని కట్టిపడేసిన ఈ మూవీ భవానీ మీడియా ద్వారా ఈ రోజు రాత్రి అక్టోబరు 19 నుంచి ఆహాలో స్ర్టీమ్ కానుంది.


అనంతిక సనిల్ కుమార్, రిషి రిత్విక్ ఇతర కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకి సామ్ సీహెచ్ అందించిన మ్యూజిక్ మరో ప్రత్యేక ఆకర్షణ. విక్రమ్ ప్రభు సాలిడ్ యాక్షన్, మైండ్ బ్లోయింగ్ స్టోరీ టెల్లింగ్ తో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేసే ఈ థ్రిల్లర్ ని ఆహాలో ఈ వీకెండ్ మిస్ అవ్వొద్దు.

మరింత సమాచారం తెలుసుకోండి: